IPL 2022: గుజరాత్, యూపీల నుంచి కొత్త ఐపీఎల్ జట్లు!!

అదానీ గ్రూప్.. అహ్మదాబాద్ నుంచి, లక్నో నుంచి జట్లు అత్యధికంగా బిడ్డింగ్ వేసిన జట్లుగా కనిపిస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే రాబోయే సీజన్ కు బరిలోకి దిగే పది జట్లలో ఈ రెండే......

IPL 2022: గుజరాత్, యూపీల నుంచి కొత్త ఐపీఎల్ జట్లు!!

Ipl New Teams

IPL 2022: ప్రపంచంలోనే అత్యంత ధనికమైన దేశీవాలీ లీగ్ ఐపీఎల్.. అవాంతరాలను దాటుకుని ఎట్టకేలకు ఆఖరి సీజన్ ను రెండు దఫాలుగా పూర్తి చేసుకుంది. రాబోయే సీజన్ కు మరింత ముస్తాబై మరో జట్లను జత కలుపుకుని లీగ్ ఉంటుందని బీసీసీఐ ముందే చెప్పింది. ఈ మేరకే సన్నాహాలు మొదలుపెట్టిందట. దాదాపు అదానీ గ్రూప్.. అహ్మదాబాద్ నుంచి, లక్నో నుంచి జట్లు అత్యధికంగా బిడ్డింగ్ వేసిన జట్లుగా కనిపిస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే రాబోయే సీజన్ కు బరిలోకి దిగే పది జట్లలో ఈ రెండే ఉండొచ్చని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.

ఈ వేలం అధికారికంగా అక్టోబర్ 25న జరగనుంది. బిడ్డింగ్ పేపర్లను సమర్పించే తేదీ గడువు పొడిగించిన బీసీసీఐ.. అక్టోబర్ 20 ఆఖరు తేదీగా ప్రకటించింది. బిడ్డింగ్ పేపర్లను కోట్ చేయనున్న వారి వివరాలిలా..

* Sanjeev Kumar – RPSG.
* Glazer Family – Manchester United Owners.
* Adani Group.
* Naveen Jindal – Jindal Power & Steel.
* Torrent Pharma.
* Ronnie Screwvala.
* Aurobindo Pharma.
* Kotak Group.
* CVC Partners.
* Singapore Based PE Firm.
* Hindustan Times Media.
* Broadcast & Sport Consulting Agencies ITW, Group M.

ఎవరి నుంచైనా రూ.7వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్ల వరకూ ఉండేలా ఆశిస్తుంది ఐపీఎల్ మేనేజ్మెంట్. ఐపీఎల్ జట్ల కనీస ధర రూ.2వేల కోట్లు పొందుపరచగా.. ఆయా కంపెనీల వార్షిక వేతనం రూ.3వేల కోట్లకు మించి ఉండాలని పేర్కొంది.

……………………………………….. : తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు విడుదల

ఈ కోట్ చేయడానికి కూడా రూ.10లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. బిడ్డింగ్ పేపర్లను.. ఇన్విటేషన్ టూ టెండర్ అనే డాక్యుమెంట్ రూపంలో కొనుగోలు చేయాలి. ఇక ఈ కొత్త టీంల కోసం బీసీసీఐ ఆరు ప్రధాన సిటీలను షార్ట్ లిస్ట్ చేసింది. అహ్మదాబాద్, లక్నో, కటక్, గువాహటి, రాంచీ, ధర్మశాలల నుంచి రెండు జట్లు రానున్నాయట.

ఐపీఎల్ విస్తరణ అనేది కొత్త ప్రయోగమేమీ కాదు. పూణె వారియర్స్, కొచ్చి టస్కర్స్ కేరళ 2010లో ఆల్రెడీ ఐపీఎల్ లో జాయిన్ అయి నిష్క్రమించాయి. మరోసారి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ లీగ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చినప్పుడు రైజింగ్ సూపర్‌జెయంట్, గుజరాత్ లయన్స్ తాత్కాలిక అభ్యర్థిత్వంపై లీగ్ లో అడుగుపెట్టాయి.