IPL-2023: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు చేదు వార్త.. బౌలింగ్ కు దూరమైన బెన్ స్టోక్స్

బెన్ స్టోక్స్ ఎడమ మోకాలి నొప్పితో బాధపడుతూ కార్టిసోన్ ఇంజెక్షన్ చేయించుకోవడమే అందుకు కారణం. డిసెంబరులో చెన్నై సూపర్ కింగ్స్ తో భారీ ధరకు బెన్ స్టోక్స్ ఒప్పందం చేసుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో అతడు ఫిట్ గా కనపడలేదు.

IPL-2023: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు చేదు వార్త.. బౌలింగ్ కు దూరమైన బెన్ స్టోక్స్

IPL-2023

IPL-2023: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు చేదు వార్త. ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను ఐపీఎల్-2023 (IPL-2023)లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ ధరకు (రూ.16.25 కోట్లకు) సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అతడు ఈ సీజన్ ఐపీఎల్ లో ఆడుతున్నప్పటికీ బ్యాటింగ్ మాత్రమే చేయనున్నాడు. బౌలింగ్ చేయడు.

బెన్ స్టోక్స్ ఎడమ మోకాలి నొప్పితో బాధపడుతూ కార్టిసోన్ ఇంజెక్షన్ చేయించుకోవడమే అందుకు కారణం. డిసెంబరులో చెన్నై సూపర్ కింగ్స్ తో భారీ ధరకు బెన్ స్టోక్స్ ఒప్పందం చేసుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో అతడు ఫిట్ గా కనపడలేదు. అతడి కుడి మోకాలి సమస్యపై ఇంగ్లండ్-వేల్స్ క్రికెట్ మెడికల్ బోర్డ్ సిబ్బంది చెన్నై సూపర్ కింగ్స్ వైద్య సిబ్బందితో ఈ విషయంపై మాట్లాడారు.

జూన్ లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య 5 టెస్టు మ్యాచుల యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నెల 31 నుంచే ఐపీఎల్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. దీంతో బెన్ స్టోక్స్ పై అధిక ఒత్తిడి పడకుండా చూసుకోవాలని ఇంగ్లండ్-వేల్స్ క్రికెట్ మెడికల్ బోర్డ్ సిబ్బంది కోరినట్లు తెలిసింది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ హస్సీ దీనిపై దృష్టి సారించారు. కాగా, మార్చి 31 నుంచి మే 28 వరకు 16వ సీజన్ ఐపీఎల్ జరగనుంది.

IPL 2023: బ్యాట్ పట్టుకొని గ్రౌండ్‌లోకి స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చిన ధోనీ.. అభిమానుల కేరింతలతో మారుమోగిన చెపాక్ స్టేడియం.. వీడియో వైరల్