iQOO Neo 7 SE : iQOO నియో 7 SE స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2నే లాంచ్.. కీలక ఫీచర్లు ఇవిగో..!

iQOO Neo 7 SE : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐక్యూ (iQOO) నుంచి కొత్త మిడ్-రేంజ్ అప్‌గ్రేడ్ వెర్షన్ వస్తోంది. డిసెంబర్ 2న అధికారికంగా ఐక్యూ నియో 7 SE (iQOO Neo 7 SE) స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది.

iQOO Neo 7 SE : iQOO నియో 7 SE స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2నే లాంచ్.. కీలక ఫీచర్లు ఇవిగో..!

iQOO Neo 7 SE key details officially confirmed ahead of December 2 launch

iQOO Neo 7 SE : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐక్యూ (iQOO) నుంచి కొత్త మిడ్-రేంజ్ అప్‌గ్రేడ్ వెర్షన్ వస్తోంది. డిసెంబర్ 2న అధికారికంగా ఐక్యూ నియో 7 SE (iQOO Neo 7 SE) స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. అంతకంటే ముందు iQOO Neo 7 SE ఫోన్ ఫుల్ స్పెసిఫికేషన్‌లను కంపెనీ కీలక ఫీచర్లను వెల్లడించింది. ఈ ఏడాది మేలో iQOO Neo 6 SEని లాంచ్ చేసింది. ఆరు నెలల తర్వాత, మిడ్-రేంజ్ ఫోన్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను లాంచ్ చేస్తోంది.

iQOO Neo 7 SE డిసెంబర్ 2న చైనాలో లాంచ్ కానుందని నివేదిక వెల్లడించింది. భారత మార్కెట్లో iQOO Neo 7 SE లాంచ్ గురించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అధికారిక లాంచ్‌కు ఒక రోజు ముందే కీలక వివరాలను కంపెనీ స్వయంగా వెల్లడించింది. iQOO Neo 6 దేశంలో iQOO Neo 6 SE మాదిరిగానే దాదాపు ఒకే ఫీచర్లతో అందుబాటులోకి రానుంది.iQOO Neo 7 SE key details officially confirmed ahead of December 2 launch

iQOO Neo 7 SE key details officially confirmed ahead of December 2 launchరాబోయే iQOO ఫోన్ MediaTek చిప్‌సెట్, AMOLED స్క్రీన్ ప్యాక్, పెద్ద బ్యాటరీతో పాటు మరిన్ని ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. ఈ ప్రీమియం ఫోన్ గురించి ఇప్పటివరకు కొన్ని వివరాలు మాత్రమే వెల్లడయ్యాయి. iQOO Neo 7 SE హుడ్ కింద మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్‌తో రానుందని కంపెనీ ధ్రువీకరించింది. లేటెస్ట్ 5G ఫోన్ హుడ్ కింద 5,000mAh బ్యాటరీతో రానుందని కంపెనీ వెల్లడించింది. అయితే, కంపెనీ 120W ఫాస్ట్ ఛార్జర్‌కు సపోర్టును కూడా అందిస్తుంది.

Read Also : JioMart On Whatsapp Chat : జియోమార్ట్ యూజర్లకు గుడ్‌ న్యూస్.. ఇకపై నేరుగా వాట్సాప్ చాట్‌లోనే షాపింగ్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

అలాగే iQOO రిటైల్ బాక్స్‌లో ఫాస్ట్ ఛార్జర్‌ను అందించనుంది. ఈ డివైజ్ కు సంబంధించి మిగిలిన వివరాలు డిసెంబర్ 2న అధికారికంగా వెల్లడి చేయనుంది. TENAA లిస్టును పరిశీలిస్తే.. iQOO Neo 7 SE 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. Full HD+ రిజల్యూషన్‌తో వస్తుంది. 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది.

మార్కెట్‌లోని చాలా ఫోన్‌ల మాదిరిగానే పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఆప్టిక్స్ పరంగా చూస్తే.. 64-MP ప్రైమరీ కెమెరాతో సహా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండవచ్చు. 8-MP సెన్సార్‌కు బదులుగా 2-MP కెమెరా ఉండవచ్చు. మూడో కెమెరా మాక్రో షాట్‌ల కోసం 2-MP సెన్సార్‌తో వస్తుంది. అయితే.. ఈ 2-MP సెన్సార్లు రియల్ లైఫ్‌లో ఎలాంటి ఉపయోగం లేదు. కానీ, iQOO Neo 7 SE అధికారిక ఫీచర్లు కాదని భావించాలి.

iQOO Neo 7 SE key details officially confirmed ahead of December 2 launch

iQOO Neo 7 SE key details officially confirmed ahead of December 2 launch

కంపెనీ డిసెంబర్ 2న అధికారిక ఫీచర్లను వెల్లడించనుంది. iQOO Neo 7 SE లాంచ్ అయినప్పుడు దాని ధర రూ. 30వేల లోపు ఉండవచ్చని స్పెసిఫికేషన్లు సూచిస్తున్నాయి. ప్రస్తుతానికి, భారత మార్కెట్లో లాంచ్ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. అయితే, ఇప్పటికే iQOO Neo 6 భారత మార్కెట్లో ప్రకటించింది. ఈ ఫోన్ మొదట చైనాలో iQOO Neo 6 SEగా లాంచ్ అయింది. iQOO Neo 7 SE ఇండియన్ మార్కెట్లోకి iQOO Neo 7గా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Infinix Cheapest 5G Phone : భారత్‌లో అత్యంత చౌకైన ధరకే ఇన్‌ఫినిక్స్‌ 5G స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. స్టాక్ ఉండగానే కొనుక్కోండి!