Stomach Fat : పొట్టలో కొవ్వులు పేరుకుంటే ప్రమాదకరమా!…

ఉదయం అల్పాహారమువలన శరీరము బరువు , ఆకృతిలో మార్పులు వస్తాయి. తక్కువ ఉప్పు తింటారో వారు బరువు పెరగకుండా ఉంటారు.

Stomach Fat : పొట్టలో కొవ్వులు పేరుకుంటే ప్రమాదకరమా!…

Stomach Fat

Stomach Fat : వయసు పెరుగుతున్నతుంటే శరీరంలోని జీవక్రియల్లో మార్పులు సంభవిస్తుంటాయి. దీంతో శరీరంలో కొవ్వు మోతాదూ పెరుగుతుంది. ముఖ్యంగా పురుషుల్లో కన్నా స్త్రీలల్లోనే ఇది ఎక్కువ. మెనోపాజ్‌ దశ తరువాత చేతులు, కాళ్లు, తొడల వద్ద కొవ్వు తగ్గిపోతూ పొట్ట దగ్గర పేరుకుపోవటం ప్రారంభిస్తుంది. కడుపు లోపల అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. ఈ పరిస్ధితి కొందరిలో వంశ పారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ముట్లుడిగిన తర్వాత కలిగే హార్మోన్ల మార్పు వల్ల సంభవిస్తాయి. బరువు పెరగకుండా బొజ్జ పెరుగుతున్నా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నడుం చుట్టు కొలత 35 అంగుళాలుంటే కొవ్వులు అదుపులో ఉన్నట్లుగా భావించాలి. 35 అంగుళాలకు మించితే అనారోగ్యకర కొవ్వు పేరుకుందన్న విషయం గుర్తించాలి. శరీరంలో మిగతా భాగాల్లోని కొవ్వు కన్నా పొట్ట మీద పేరుకునే కొవ్వు చాలా ప్రమాదకరమైంది. ఇది గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు రావటానికీ దోహదం చేస్తుంది. జీవనశైలిలో మార్పులు చేసుకోవటంతో పాటు కొన్ని రకాల వ్యాయామాలు చేయటంతో దీనిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. బొజ్జను తగ్గించుకోవటానికి రోజూ వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలి. అలాగే ఆహారపు అలవాట్లో మార్పులు చేసుకోవాలి. పాలిష్‌ పట్టిన బియ్యం, గోధుమలు, బ్రెడ్‌, శుద్ధిచేసిన పాస్తాలకు బదులుగా, పిండి పదార్థాలు ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. తక్కువ తినటంతో పాటు కేలరీలనూ తక్కువగా తీసుకుంటే బరువు తగ్గుతారు.

ఉదయం అల్పాహారమువలన శరీరము బరువు , ఆకృతిలో మార్పులు వస్తాయి. తక్కువ ఉప్పు తింటారో వారు బరువు పెరగకుండా ఉంటారు. ఉప్పుకు శరీరములో నీటిని , కొవ్వును నిల్వ చేసే గుణము ఉంటుంది. దీనివల్ల బరువు పెరుగుతారు. బరువు తగ్గాలి అనగానే ఆహారము తీసుకోవడము మానేస్తారు. ఇది ఏమాత్రం సరైంది కాదు. శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు సమపాళ్ళలో లభించేలా ఆహారము తీసుకోవాలి. పరిమితమైన ఆహారము ఉత్తమం. రోజుకు మూడు కిలోమీటర్ల దూరం నడవాలి. అలాగే జాగింగ్ వంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఒత్తిడి, నిద్రలేమి లేకుండా చూసుకోవాలి. తగినంత విశ్రాంతి శరీరానికి ఇవ్వటం మంచిది. శరీరానికి సరిపడినంత నీరు తాగడము వలన ఆహారము తీసుకోవడము తగ్గుతుంది. జీవ పక్రియ మెరుగవుతుంది.