Tamannaah : ‘లెవన్త్ అవర్’.. తమన్నా రెమ్యునరేషన్ ఎంతంటే!..

తెలుగువారికి అన్‌లిమిటెడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తూ, డిజిటల్ రంగంలో దూసుకుపోతున్న తెలుగు ఓటీటీ ఆహా తెలుగు ప్రేక్ష‌కుల కోసం సరికొత్త వెబ్‌సిరీస్‌లు, సూపర్ హిట్ సినిమాలతో రోజురోజుకీ మరింత ఆదరణ దక్కించుకుంటోంది. ఇప్పుడు ప్రేక్షకులకు తెలుగు సంవ‌త్స‌రాది వేడుక‌ల‌ను ముందుగానే అందించ‌డానికి సిద్ధ‌మైంది ‘ఆహా’. అందులో భాగంగా ఏప్రిల్ 9న ఆహాలో మిల్కీబ్యూటీ త‌మ‌న్నా తొలిసారి న‌టించిన ఒరిజిన‌ల్ ‘లెవన్త్ అవర్’ స్ట్రీమింగ్ కానుంది.

Tamannaah : ‘లెవన్త్ అవర్’.. తమన్నా రెమ్యునరేషన్ ఎంతంటే!..

Tamannaah

Tamannaah: తెలుగువారికి అన్‌లిమిటెడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తూ, డిజిటల్ రంగంలో దూసుకుపోతున్న తెలుగు ఓటీటీ ఆహా తెలుగు ప్రేక్ష‌కుల కోసం సరికొత్త వెబ్‌సిరీస్‌లు, సూపర్ హిట్ సినిమాలతో రోజురోజుకీ మరింత ఆదరణ దక్కించుకుంటోంది. ఇప్పుడు ప్రేక్షకులకు తెలుగు సంవ‌త్స‌రాది వేడుక‌ల‌ను ముందుగానే అందించ‌డానికి సిద్ధ‌మైంది ‘ఆహా’. అందులో భాగంగా ఏప్రిల్ 9న ఆహాలో మిల్కీబ్యూటీ త‌మ‌న్నా తొలిసారి న‌టించిన ఒరిజిన‌ల్ ‘లెవన్త్ అవర్’ స్ట్రీమింగ్ కానుంది.

11th Hour : ‘చక్రవ్యూహంలో చిక్కుకున్నప్పుడు దారి వెతికితే దొరకదు.. క్రియేట్ చెయ్యాలి’ అంటున్న తమన్నా..

మార్చి 29 ‘లెవన్త్ అవర్’ టీజర్ రిలీజ్ చేయగా కొద్ది గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ దక్కించుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. సిల్వర్ స్క్రీన్ మీద స్టార్ హీరోయిన్ అయిన తమన్నా లీడ్ రోల్ చేస్తుంది అనగానే ‘ఎంత తీసుకుని ఉంటుదబ్బా’ అంటూ ఆరాలు తియ్యడం స్టార్ట్ చేశారు. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్న ఈ సిరీస్‌ని ప్రదీప్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. పురుషాధిక్య ప్ర‌పంచంలో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకోవ‌డానికి అర‌త్రికా రెడ్డి అనే ఓ అమ్మాయి ఎలా పోరాటం చేసింద‌నేది ఈ సిరీస్ మెయిన్ థీమ్.. డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మేళ‌వింపుగా ఈ ‘లెవన్త్ అవర్’ 8 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్‌గా రూపొందింది.

11th Hour

మ‌ల్టీ బిలియ‌న్ డాల‌ర్స్ కంపెనీ ఆదిత్య గ్రూప్ కంపెనీకి అర‌త్రికా రెడ్డి సీఈఓ. ఈ కంపెనీ అనుకోకుండా ఆర్థిక స‌మ‌స్యల వ‌ల‌యంలో చిక్కుకుంటుంది. ఆమె స్నేహితులే శ‌త్రువులుగా మారుతారు. ఎగ్జ‌యిట్‌మెంట్‌తో కూడిన ఈ గంద‌ర‌గోళం నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి అర‌త్రికా రెడ్డి ఎలా పోరాడింది. ఆ జీవ‌న పోరాటంలో ఆమె విజ‌యం సాధించిందా? అనే ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌తో ‘లెవన్త్ అవర్’ సిరీస్ తెరకెక్కింది. తమన్నా ఫస్ట్ టైమ్ వెబ్ సిరీస్ చేస్తుండడంతో దీనికి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ముందునుండీ క్యూరియాసిటీతో ఉన్నారు ఆడియెన్స్. ఈ సిరీస్ షూటింగ్ టైంలోనే మిల్కీబ్యూటీ కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. అలాగే ఆమె రెమ్యునరేషన్ గురించి కూడా పలు వార్తలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఈ సిరీస్ కోసం తమన్నా దాదాపు రెండు కోట్ల రూపాయల పారితోషికం అందుకుందట. ఇంత భారీ మొత్తం చెల్లించి మరీ తమన్నాను తీసుకున్నారంటే ‘లెవన్త్ అవర్’ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోండి మరి..

11th Hour