World’s smallest spoon: ప్రపంచంలోనే అతి చిన్న చెంచా ఇది.. వీడియో

చెక్కతో ప్రపంచంలోనే అతి చిన్న చెంచాను తయారు చేసి రాజస్థాన్ కు చెందిన ఓ యువకుడు గిన్నిస్ రికార్డు సాధించాడు. ఆ చెంచా పొడవు 2 మిల్లిమీటర్లు ఉంది. చేతి వేలి గోరు కంటే తక్కువ పరిమాణంలో దీన్ని ఆ యువకుడు రూపొందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా గిన్నిస్ ప్రపంచ రికార్డు ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

World’s smallest spoon: ప్రపంచంలోనే అతి చిన్న చెంచా ఇది.. వీడియో

World’s smallest spoon

World’s smallest spoon: చెక్కతో ప్రపంచంలోనే అతి చిన్న చెంచాను తయారు చేసి రాజస్థాన్ కు చెందిన ఓ యువకుడు గిన్నిస్ రికార్డు సాధించాడు. ఆ చెంచా పొడవు 2 మిల్లిమీటర్లు ఉంది. చేతి వేలి గోరు కంటే తక్కువ పరిమాణంలో దీన్ని ఆ యువకుడు రూపొందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా గిన్నిస్ ప్రపంచ రికార్డు ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఇంతకు ముందు చెక్కతో ప్రపంచంలోనే అతి చిన్న చెంచాను (4.5 మిల్లీమీటర్ల పొడవు) తయారు చేసిన రికార్డు తెలంగాణకు చెందిన గౌరీ శంకర్ పేరు మీద ఉండేది. 2021 మేలో గౌరీ శంకర్ గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించాడు. ఆయన రికార్డును ఇప్పుడు రాజస్థాన్ యువకుడు బద్దలుకొట్టాడు. ఇందుకు సంబంధించిన వివరాలను గిన్నిస్ బుక్ తెలిపింది.

రాజస్థాన్ రాజధాని జైపూర్ కు చెందిన కళాకారుడు నవరతన్ ప్రజాపతికి చిన్న చిన్న వస్తువులు తయారు చేసే అలవాటు ఉంది. గతంలోనూ అతి చిన్న వస్తువులు తయారు చేసి పలు అవార్డులు గెలుచుకున్నాడు. తాజాగా, చెక్కతో ప్రపంచంలోనే అతి చిన్న చెంచాను తయారు చేసినందుకు గాను ఆయన గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2006లో ప్రపంచంలోనే అతి చిన్న లాంతరును తయారు చేసి నవరతన్ ప్రజాపతి లింకా ప్రపంచ రికార్డులకు ఎక్కాడు. ఆ లాంతరులో మూడు-నాలుగు చుక్కల కిరోసిస్ పోస్తే కొన్ని క్షణాల పాటు వెలుగుతుంది.

 

గతంలో తెలంగాణకు చెందిన గౌరీ శంకర్ పేరు మీద ఉన్న రికార్డు…

 

Secunderabad fire accident: మంటలు ఇంకా అదుపులోకి రాలేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి