Jigarthanda Doublex : హరీష్ శంకర్‌కి ఛాన్స్ ఇవ్వకుండా తెలుగులో కూడా రిలీజ్ చేసేస్తున్నారు..
రాఘవ లారెన్స్, ఎస్ జే సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘జిగర్‌తండా డబులెక్స్’ని తెలుగు కూడా రిలీజ్ చేసేస్తున్నారు. దీంతో హరీష్ శంకర్ రీమేక్ లేనట్టే.

Jigarthanda Doublex released in telugu too and so Harish Shankar remake no
Jigarthanda Doublex – Harish Shankar : సిద్దార్ధ, బాబీ సింహ, లక్ష్మి మీనన్ ప్రధాన పాత్రల్లో 2014లో తమిళ సినిమా ‘జిగర్‌తండా’. ఈ సినిమా తమిళనాట బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాదు, 2015 జాతీయ అవార్డుల పురస్కారాల్లో రెండు అవార్డులను సైతం సొంతం చేసుకుంది. దీంతో ఆ సినిమా పై పక్క ఇండస్ట్రీ దర్శకనిర్మాతలు చూపు పడింది. ఇంకేముంది ఆ బ్లాక్ బస్టర్ ని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
Virupaksha : ఓటీటీకి వచ్చేస్తున్న విరూపాక్ష.. ఎప్పుడో తెలుసా?
తెలుగులో ఈ సినిమాని హరీష్ శంకర్.. వరుణ్ తేజ్ తో ‘గద్దలకొండ గణేష్’గా రీమేక్ చేశాడు. ఈ రీమేక్ కూడా మంచి విజయన్ అందుకుంది. అయితే ఇటీవల జిగర్‌తండా తెరకెక్కించిన కార్తీక్ సుబ్బరాజ్.. ఆ మూవీ సీక్వెల్ ని ప్రకటించి శరవేగంగా షూటింగ్ చేస్తున్నాడు. ‘జిగర్‌తండా డబులెక్స్’ అనే టైటిల్ తో వస్తున్న ఈ సీక్వెల్ లో రాఘవ లారెన్స్ (Raghava Lawrence), ఎస్ జే సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సీక్వెల్ నుంచి రిలీజ్ చేసిన టీజర్ ఆడియన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేసింది.
Ram Charan : బ్రాడ్ పిట్ గురించి నాకు తెలియదు.. కానీ రామ్‌చరణ్ మాత్రం.. ప్రియాంక చోప్రా!
ఇక తెలుగులో గద్దలకొండ గణేష్ తో మంచి విజయాన్ని అందుకున్న హరీష్ శంకర్.. ఈ సీక్వెల్ ని కూడా తెరకెక్కిస్తాడా? అని అందరూ ఆలోచిస్తున్న సమయంలో జిగర్‌తండా డబులెక్స్ టీం హరీష్ శంకర్ తో పాటు అందరికి షాక్ ఇచ్చారు. ఈ సీక్వెల్ ని తమిళ్ తో పాటు తెలుగు, హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది దీపావళికి మూవీ ఈ మూడు లాంగ్వేజ్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ఒక గ్లింప్స్ ద్వారా తెలియజేశారు. రాఘవ లారెన్స్ తెలుగులో కూడా మార్కెట్ ఉండడం వలనే డైరెక్ట్ రిలీజ్ కి వస్తున్నట్లు తెలుస్తుంది.