NTR – RRR : జక్కన్న గొడ్డలి తీసుకుని నా వెంట పడతాడు..

రాజమౌళి గొడ్డలితో తన వెంటపడుతారంటున్నారు ఎన్టీఆర్. రీసెంట్‌గా కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలను ఫ్యాన్స్‌‌తో షేర్ చేసిన యంగ్ టైగర్.. అంతకు మించి మాత్రం చెప్పనన్నారు..

NTR – RRR : జక్కన్న గొడ్డలి తీసుకుని నా వెంట పడతాడు..

Ntr – Rrr

NTR – RRR: రాజమౌళి గొడ్డలితో తన వెంటపడుతారంటున్నారు ఎన్టీఆర్. రీసెంట్‌గా కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలను ఫ్యాన్స్‌‌తో షేర్ చేసిన యంగ్ టైగర్.. అంతకు మించి మాత్రం చెప్పనన్నారు. ఇంతకీ తారక్ చెప్పిన సంగతులేంటి.. ‘ఆర్ఆర్ఆర్’ సీక్రెట్స్ ఏమన్నా రివీల్ చేశారా.. అంటూ పూర్తి వివరాలు..

‘ఆర్ఆర్ఆర్’ కోసం 18 నెలల కష్టం… ఫిజికల్ అప్పియరెన్స్ కోసం ఎన్టీఆర్ స్పెషల్ ఇంట్రెస్ట్.. ఆర్ఆర్ఆర్ కు ముందు ఎన్టీఆర్ వెయిట్ 71 కేజీలు. కానీ రాజమౌళి ప్రాజెక్ట్ కోసం దాదాపు 9 కిలోల మజిల్స్ వర్క్ కోసం యంగ్ టైగర్. అప్పట్లో ‘యమదొంగ’ ప్రాజెక్ట్ కోసం వెంటపడి మరీ ఎన్టీఆర్ బరువు తగ్గేలా చేసిన జక్కన్న.. ట్రిపుల్ ఆర్ కోసం మాత్రం ఎన్టీఆర్ వెయిట్ గెయిన్ అయ్యేలా చూశారు. కరోనా ‘ఆర్ఆర్ఆర్’ బడ్జెట్‌ని కానీ, స్టోరీని కానీ ఎఫెక్ట్ చేయలేదని చెప్పిన తారక్… యూనిట్ వర్కింగ్ స్పీడ్‌ని మాత్రం బాగా దెబ్బతీసిందన్నారు.

Jr NTR

‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీ రిలీజ్ ఎట్టిపరిస్థితుల్లో ఉండదన్నారు యంగ్ టైగర్. సినిమాను వెండితెరపై ఆడియన్స్ చూడాలనుకుంటున్నారు. థియేటర్లలో సీట్లో కూర్చోలేరు. అంతలా ఎంజాయ్ చేస్తారు… ఆశ్చర్యపోతారు. ఇంతకన్నా ఈ సినిమా గురించి చెబితే, రాజమౌళి ఓ గొడ్డలి పట్టుకుని తన వెంట పడతారని రీసెంట్ ఇంటర్వ్యూలో కామెడీ చేశారు యంగ్ టైగర్. అలాగే ప్రస్తుతానికి డైరెక్టర్‌గా మారాలనే కోరిక లేదన్నారు. కానీ నిర్మాతగా ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చూపించాలనుకుంటున్నారు తారక్.

RRR

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కొరటాల శివ కాంబినేషన్లో ఎన్టీఆర్ ఓ సినిమా కమిటైన విషయం తెలిసిందే. ప్రజెంట్ దానికి సంబంధించి స్ట్రిప్ట్ వర్క్ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కూడా పాన్ ఇండియా లెవెల్‌లోనే ప్లాన్ చేస్తున్నారు. కొరటాల తర్వాత ‘కె.జి.యఫ్’ ఫేం ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్‌పైకెళ్తుందని చెప్పేశారు ఎన్టీఆర్. సో ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత సూపర్ హిట్ డైరెక్టర్స్ కాంబోలో ఎన్టీఆర్ సినిమాలుంటాయని అఫీషియల్‌గా తెలియడంతో దూకుడు పెంచారు యంగ్ టైగర్ ఫ్యాన్స్..