Sirivennela-NTR: నా ఏడుపును ఆయన కలమే వర్ణించాలి.. ఎన్టీఆర్ బాధ వెనుక కథ ఇదీ!

ఎన్టీఆర్ కు ఇది బాగా కనెక్ట్ అయిన పాట. చాలామంది అభిమానులు.. ఈ పాటను హరికృష్ణ పోయినప్పుడు కలిగే బాధకు.........

Sirivennela-NTR: నా ఏడుపును ఆయన కలమే వర్ణించాలి.. ఎన్టీఆర్ బాధ వెనుక కథ ఇదీ!

Jr Ntr Sirivennela

Sirivennela : దిగ్గజ తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రికి ఎందరో నటులు, రాజకీయ సినీ ప్రముఖులు, అభిమానులతో పాటు.. జూనియర్ ఎన్టీఆర్ కూడా నివాళులు అర్పించారు. ఫిలిం ఛాంబర్ లో సిరివెన్నెల పార్థివదేహాన్ని కొద్దిసేపు అలా చూస్తుండిపోయారు జూనియర్. ఈ సమయంలో పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కూడా అక్కడే ఉన్నారు. సిరివెన్నెలతో అనుబంధం గుర్తుచేసుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ కంటతడి పెట్టినంతగా బాధపడ్డారు. తన మనసులోని బాధను … సిరివెన్నెల కలం తప్ప మరేదీ వర్ణించలేదని ఈ సందర్భంగా జూనియర్ చెప్పారు.

Read This :Sirivennela : తెలుసా మనసా పాట పక్కన కూర్చొని రాయించుకున్నా: నాగార్జున

“కొన్నిసార్లు మన ఆవేదన, బాధను ఎలా వ్యక్తపరచాలో కూడా మాటలు రావు. అలాంటి మాటలనే ఆ మహానుభావుడే తన కలంతో వ్యక్తపరచాలి. నా ఆవేదనను కూడా ఆయన కలంతోనే ఆయనే వ్యక్తపరిస్తే బాగుండేది. ఆయన కలం ఆగినా.. ఆయన రాసిన మాటలు, పాటలు, సాహిత్యం… తెలుగు జాతి, భాష బతికున్నంత కాలం చిరస్మరణీయంగా బతికే ఉంటుంది. రాబోయే తరానికి ఆ సాహిత్యం బంగారు బాట వేయాలి. తెలుగు సాహిత్యం వైపు ఆయన చల్లని చూపు ఎల్లపుడూ ఉండాలి అని కోరుకుంటున్నా” అని ఎన్టీఆర్ చెప్పారు.

ఇద్దరి పుట్టిన రోజు ఒకటే

జూనియర్ ఎన్టీఆర్, సీతారామశాస్త్రి ఇద్దరూ పుట్టిన తేదీ ఒకటే. సిరివెన్నెల 20 May 1955 నాడు… జూనియర్ ఎన్టీఆర్ 20 May, 1983 నాడు పుట్టారు. అలా ఇద్దరి పుట్టినరోజులు ఒకే నెలలో రావడం కూడా ఎన్టీఆర్ ను.. సీతారామశాస్త్రికి దగ్గర చేసింది.

అరవింద సమేత సక్సెస్ మీట్ లో సిరివెన్నెల ఏమన్నారంటే..

“మారిన, మారవలసిన ట్రెండ్ కు టార్చ్ బేరర్ గా తారకరాముడు ముందుకొచ్చాడు. అలా ఎన్టీఆర్ ను త్రివిక్రమ్ చూపించాడు. ఎన్టీఆర్, జగపతి బాబు అందరినీ ఆశ్చర్యపోయేలా నటించారు. ఈ సినిమా గొప్పగా చెప్పేందుకు సూపర్లేటివ్ పదాలన్నీ ఉపయోగించినా సరిపోవన్నారు. మహిశాసురుడిలా మారిన మనిషిలో అసలైన మనిషిని మేల్కొలపాలంటే.. యుద్ధం కాదు… శాంతి కావాలి అని యుద్ధం ద్వారా చూపించిన త్రివిక్రమ్ మహత్తరమైన ప్రక్రియ చేశారని చెప్పారు. ఫ్యాక్షనిజంలో ఆడవారి సెంటిమెంట్ ను హైలైట్ చేసిన, సంచలన చర్చకు తెరతీసిన మొట్టమొదటి సినిమా ఇదే అన్నారు. స్త్రీత్వాన్ని.. మాతృత్వాన్ని గుర్తించాలి” అని పిలుపునిచ్చారు సిరివెన్నెల.
ఈ థీమ్ తోనే..
మూవీలోని ఏడ పోయినాడో పాట ఉంటుంది.
రం.. రుధిరం.. సమరం.. శిశిరం…
రం మరణం.. గెలవం.. ఎవరం..
ఏడ పోయినాడో.. ఏడపోయినాడో..
సింతలేని లోకం సూడబోయినాడో..
సీమ కక్ష వేటువేస్తే రాలిపోయినాడో..
ఈ పాటను పెంచలదాస్ తో కలిసి సీతారామ శాస్త్రి రాశారు. ఈ పాట సంచలనం సృష్టిస్తుందని ఈ చిత్ర యూనిట్ చాలా ఎక్స్ పెక్ట్ చేసింది. ఇటీవలే థమన్ కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ మాట చెప్పాడు. పాటలోని ఎమోషన్ ఒక రేంజ్ లో ఉంటుంది. సాహిత్య విలువలు..ట్యూన్.. టేకింగ్ కూడా ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. హిట్ అయినప్పటికీ… అందుకోవాల్సిన స్థాయి రాలేదని యూనిట్ ఇప్పటికీ అభిప్రాయపడుతుంటుంది. ఎన్టీఆర్ కు ఇది బాగా కనెక్ట్ అయిన పాట. చాలామంది అభిమానులు.. ఈ పాటను హరికృష్ణ పోయినప్పుడు కలిగే బాధకు అన్వయించుకుంటుంటారు.

ఇదొక్కటే కాదు.. ఇదే మూవీలోని “అనగనగా.. అరవిందట తన పేరు.. అందానికి సొంతూరు”తో పాటు.. ఎన్టీఆర్ మిగతా సినిమాల్లోని పాటలను సిరివెన్నెల రాశారు.

Read Also : Sirivennela : ధన్యోస్మి మిత్రమా..! సీతారాముడి మృతిపై ఇళయరాజా భావోద్వేగం