Jr NTR : జిమ్ చేస్తుండగా జూ.ఎన్టీఆర్‌కు గాయం… సర్జరీ

అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ షేర్ చేసిన ఫొటోలో కుడి చేతికి బ్యాండేజీతో కనిపించారు ఎన్టీఆర్..

Jr NTR : జిమ్ చేస్తుండగా జూ.ఎన్టీఆర్‌కు గాయం… సర్జరీ

Jr Ntr

Updated On : November 5, 2021 / 1:18 PM IST

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. తారక్, కుమారులు అభయ్ రావ్, భార్గవ రామ్‌లతో కలిసి ఉన్న పిక్ షేర్ చెయ్యగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ట్రెడిషనల్ వేర్‌లో కొడుకులతో తారక్ క్యూట్ ఉన్నారంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

RRR Glimpse : గ్లింప్స్ గూస్ బంప్స్..

అయితే ఈ ఫొటోలో ఎన్టీఆర్ కుడిచేతికి కట్టు ఉండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇటీవల ఎన్టీఆర్ కుడి చేతి వేలుకు సర్జరీ జరిగిందనే విషయం బయటకు వచ్చింది. ఇటీవల తన ఇంటి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గాయపడ్డారు ఎన్టీఆర్.

RRR Glimpse : ఎన్టీఆర్ – చరణ్ ఫ్యాన్స్ థియేటర్లలో సీట్లు చింపే సీన్ ఇదేనేమో?

నొప్పి ఎక్కువగా ఉండడంతో నాలుగు రోజుల క్రితం వైద్యులు తారక్ కుడి చేతి వేలికి మైనర్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కంప్లీట్ చేసిన జూనియర్ నెల రోజుల తర్వాత కొరటాల శివ షూటింగ్ స్టార్ట్ చెయ్యనున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)