MLA Shakeel : జూబ్లీహిల్స్ ప్రమాదం కేసు.. అనేక ప్రశ్నలు.. అనేక మలుపులు

జూబ్లీ హిల్స్ లో జరిగిన కారు బీభత్సానికి సంబంధించిన కేసు మలుపులు తిరుగుతోంది. రోజుకో ట్విస్టు వెలుగు చూస్తోంది. ఎమ్మెల్యే షకీల్...

MLA Shakeel : జూబ్లీహిల్స్ ప్రమాదం కేసు.. అనేక ప్రశ్నలు.. అనేక మలుపులు

Car Accident

Jubilee Hills Car accident : జూబ్లీ హిల్స్ లో కారు బీభత్సానికి సంబంధించిన కేసు మలుపులు తిరుగుతోంది. రోజుకో ట్విస్టు వెలుగు చూస్తోంది. ఎమ్మెల్యే షకీల్ ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారనే సంగతి తెలిసిందే. ఈ కేసును ఎమ్మెల్యే మేనేజ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంఘటన జరిగిన సమయంలో కారు ప్రమదానికి కారకులైన వారిని చితకబాదుతుండగా ఓ ఎమ్మెల్యే చూసి బంజారాహిల్స్ ఏసీపీకి ఫోన్ చేసి సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

Read More : Jubilee Hills : జూబ్లీహిల్స్ కారు ఆక్సిడెంట్.. డ్రైవింగ్ చేసింది అతనే

ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహీల్ ఎక్కడున్నాడో ఇంతవరకు తెలియరావడం లేదు. పోలీసులు కావాలనే అతడిని తప్పించారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గత ఐదు రోజులుగా ఇతను అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. బాధిత కుటుంబం హఠాత్తుగా నిమ్స్ నుంచి ఎందుకు ఎస్కేప్ అయ్యారో తెలియడం లేదు. బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల రూపాయలు ఇచ్చి డీల్ చేసింది ఎవరు ? ఎమ్మెల్యే షకీల్ ఆదేశాలతో రంగంలోకి దిగింది ఎవరనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Read More : Jubilee Hills Car Accident : జూబ్లీహిల్స్ కారు ప్రమాద ఘటన.. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే షకీల్ కజిన్ మీర్జా

జూబ్లీహిల్స్‌ కారు ప్రమాదం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అసలు ఏం జరుగుతుందో, నేరస్థులెవరో తెలియని అయోమయం నెలకొంది. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసినా.. వారే ఆ కారు నడిపారా..? లేక ఇంకా ఎవరినైనా తప్పించడానికి వీరిని అరెస్టు చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారు యాక్సిడెంట్‌ కేసులో.. మీర్జా, అతని కుమారుడిని అరెస్టు చేసినట్టు చెబుతున్నారు పోలీసులు. డ్రైవింగ్ చేసింది సయ్యద్ ఆఫ్నాన్ గా నిర్ధారించారు. స్థానికులు, బాధితుల సమాచారం ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఆప్నాన్ తో పాటు రసూల్ ను అదుపులోకి తీసుకున్నారు. సయ్యద్ ఆఫ్నాన్ (19) అనే BBA విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. అయితే..షకీల్ కొడుకు రాహీల్ ని కేసు నుంచి సేవ్ చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు, రాహీల్ కార్ డ్రైవ్ చేసినా ఆఫ్నాన్ చేశాడని పోలీస్ లు నిరూపించే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఈ మిస్టరీ ఎప్పటికీ వీడుతుందో చూడాలి.