Jubilee Hills : జూబ్లీహిల్స్ కారు ఆక్సిడెంట్.. డ్రైవింగ్ చేసింది అతనే

జూబ్లీ హిల్స్ లో కారు ప్రమాద కేసులో పురోగతి సాధించారు పోలీసులు. డ్రైవింగ్ చేసింది సయ్యద్ ఆఫ్నాన్ గా నిర్ధారించారు. స్థానికులు, బాధితుల సమాచారం ఆధారంగా నిందితుడిని గుర్తించారు...

Jubilee Hills : జూబ్లీహిల్స్ కారు ఆక్సిడెంట్.. డ్రైవింగ్ చేసింది అతనే

Car Accident

Jubilee Hills Car Accident : జూబ్లీ హిల్స్ లో కారు ప్రమాద కేసులో పురోగతి సాధించారు పోలీసులు. డ్రైవింగ్ చేసింది సయ్యద్ ఆఫ్నాన్ గా నిర్ధారించారు. స్థానికులు, బాధితుల సమాచారం ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఆప్నాన్ తో పాటు రసూల్ ను అదుపులోకి తీసుకున్నారు. సయ్యద్ ఆఫ్నాన్ (19) అనే BBA విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. అయితే..షకీల్ కొడుకు రహూల్ ని కేసు నుంచి సేవ్సే చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు, రహూల్ కార్ డ్రైవ్ చేసినా ఆఫ్నాన్ చేశాడని పోలీస్ లు నిరూపించే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌ కారు ప్రమాదం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అసలు ఏం జరుగుతుందో, నేరస్థులెవరో తెలియని అయోమయం నెలకొంది. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసినా.. వారే ఆ కారు నడిపారా..? లేక ఇంకా ఎవరినైనా తప్పించడానికి వీరిని అరెస్టు చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారు యాక్సిడెంట్‌ కేసులో.. మీర్జా, అతని కుమారుడిని అరెస్టు చేసినట్టు చెబుతున్నారు పోలీసులు.

Read More : Jubilee Hills Car Accident : జూబ్లీహిల్స్ కారు ప్రమాద ఘటన.. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే షకీల్ కజిన్ మీర్జా

ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఎమ్మెల్యే షకీల్ కామెంట్స్‌ అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. గురువారం రాత్రి 8 గంటల 45 నిమిషాలకు ప్రమాదం జరిగింది. ఆ కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ చూసి, షకీల్‌కు ఫోన్‌ చేశారు పోలీసులు. గంటన్నర తర్వాత, ఆ కారు తనకు తెలిసిన దూరపు వాళ్లదని చెప్పాడు షకీల్. ఆ తర్వాత.. అది తన ఫ్రెండ్‌ కారని మాట మార్చారు. ఆ తర్వాతేమో.. మీర్జా ఇన్‌ఫ్రా పేరుతో, తన ఫ్రెండ్ కారు తీసుకున్నాడని చెప్పారు.
మళ్లీ మాటమార్చి.. మీర్జా తన కజిన్‌ అని, ఆడియో రిలీజ్‌ చేశారు షకీల్. మీర్జా కొడుకుతో సహా, అతని కుటుంబం కారులో ఉందన్నారు.

Read More : Jubilee hills Car accident: జూబ్లీహిల్స్ కారు ఘటనలో వెలుగులోకి కొత్త వాస్తవాలు

మాటలు మార్చే పర్వం కొనసాగుతుండగానే.. నిమ్స్‌ ఆస్పత్రి నుంచి బాధితుల మిస్సింగ్‌ కలకలం రేపింది. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కాజల్‌ ఏమైందో తెలియకుండా పోయింది. అయితే, బాధితులతో మాట్లాడుకోవాలని చెప్పానని షకీల్‌ చెప్పడం చర్చనీయాంశమైంది. అటు కాజల్ మిస్సింగ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. అసలు కారులో ఎంతమంది ఉన్నారనేది ఇప్పటికీ మిస్టరీగానే మారింది.