K Viswanath : తీరని కె.విశ్వనాథ్ రెండు కోరికలు..

కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణవార్త సినీ పరిశ్రమని కలిచి వేసింది. ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా పరిచమై తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 50 సినిమాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడిగా జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు గుర్తింపు సంపాదించుకున్న విశ్వనాథ్ కి రెండు కోరికలు మాత్రం తీరని లోటుగా మిగిలిపోయిని.

K Viswanath : తీరని కె.విశ్వనాథ్ రెండు కోరికలు..

K Viswanath wishes

K Viswanath : కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణవార్త సినీ పరిశ్రమని కలిచి వేసింది. భారతీయ కళలకి, సాహిత్యానికి, సంగీతానికి పెద్దపీట వేస్తూ తన సినిమాలతో మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి కె.విశ్వనాథ్. రాజమౌళి కంటే ముందే తెలుగు చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన దర్శకుడు విశ్వనాథ్. 50 సినిమాల కెరీర్ లో ఎన్నో అవార్డులు అందుకున్న విశ్వనాథ్.. ఈ గురువారం (ఫిబ్రవరి 2) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణంతో చిత్ర సీమ శోక సంద్రంలో మునిగింది. ఇక విశ్వనాథ్ మరణ వార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

K Viswanath : కళాతపస్వికి కడసారి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు..

కాగా విశ్వనాథ్ తన సినీ కెరీర్ ని 1951లో మొదలుపెట్టారు. ‘పాతాళభైరవి’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన విశ్వనాథ్.. ఆ తరువాత సౌండ్ ఇంజనీర్ గా వర్క్ చేసి ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక 1965 లో వచ్చిన ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా పరిచమై తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 50 సినిమాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడిగా జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు గుర్తింపు సంపాదించుకున్న విశ్వనాథ్ కి రెండు కోరికలు మాత్రం తీరని లోటుగా మిగిలిపోయిని.

K Viswanath : బాలసుబ్రహ్మణ్యంతో గొడవ విశ్వనాథ్‌ని నటుడిని చేసింది..

అలనాటి అగ్ర దర్శకులు బాపు, బాలచందర్ వద్ద ఒక్కరోజు అయిన అసిస్టెంట్ గా పని చేయాలని విశ్వనాథ్ అనుకునేవారట. ఇక్కడ విశేషం ఏంటంటే.. వీరిద్దరూ విశ్వనాథ్ తో పాటు సినిమా ప్రయాణం మొదలుపెట్టిన వారే. కానీ వాళ్ళ మేకింగ్ నచ్చి ఒక్కసారి అయిన వారి దగ్గర అసిస్టెంట్ గా పని చేసి అబ్జర్వ్ చేయాలి అనుకునేవారట. అలాగే విశ్వనాథ్ మొదలుపెట్టి, మధ్యలోనే ఆగిపోయిన ‘సిరిమువ్వల సింహనాదం’ సినిమాని పూర్తిచేసి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అది కూడా తీరలేదు. ఈ రెండు కె.విశ్వనాథ్ కి తీరని కోరికలుగా మిగిలిపోయాయి.