KA Paul- CM KCR : ఢిల్లీలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరిపిన కేఏ పాల్.. తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ తెలంగాణ భవన్ లో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరిపిన కెఏ పాల్ కేసీఆర్ కి ఈ సందర్భంగా పాల్ కేక్ కట్ చేసి 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేసీఆర్ బాగుండాలని కోరుతూ ప్రార్థనలు చేశారు. పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలి అంటూ సూచించారు. కేసీఆర్ రాజకీయాలకు గుడ్ బై చెప్పి ప్రజా సేవ చేయాలని..బడుగు బలహీన వర్గాలు కోసం కేసీఆర్ నిస్వార్థంగా పనిచేయాలి అంటూ వ్యాఖ్యాలు చేశారు.

KA Paul
KA Paul- CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఢిల్లీలోని బీఆర్ఎస్ భవన్ లో ఘనం జరిగాయి. ఈ పుట్టిన రోజు వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే..ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు.ప్రముఖ క్రైస్తవ మతబోధకుడు అయిన కేఏ పాల్ కేసీఆర్ పుట్టిన రోజు వేడులను ఘనంగా జరిగిపారు. ఢిల్లీ బీఆర్ఎస్ భవన్ లో కేసీఆర్ పుట్టిన రోజు వేడులను నిర్వహించారు కేఏ పాల్. తాజాగా కొండగట్టు అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ.600ల కోట్లు కేటాయించిన విషయంపై కోర్టుకెళతానని..ప్రజాధనాన్ని గుడుల కోసం ఖర్చు చేస్తున్నారని కొండగట్టు కోసం కేసీఆర్ కేటాయించిన కోట్లాది రూపాయలు కేసీఆర్ అబ్బ సొమ్ములా? అంటూ ఘాటు విమర్శలు చేసిన మరునాడే కేఏ పాల్ కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించటం గమనించాల్సి విషయం.
ఢిల్లీ తెలంగాణ భవన్ లో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరిపిన కెఏ పాల్ కేసీఆర్ కి ఈ సందర్భంగా పాల్ కేక్ కట్ చేసి 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేసీఆర్ బాగుండాలని కోరుతూ ప్రార్థనలు చేశారు. ఇక్కడే కేఏ పాల్ మరోసారి తనదైన శైలిలో కేసీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలి అంటూ సూచించారు. కేసీఆర్ రాజకీయాలకు గుడ్ బై చెప్పి ప్రజా సేవ చేయాలని..బడుగు బలహీన వర్గాలు కోసం కేసీఆర్ నిస్వార్థంగా పనిచేయాలి అంటూ వ్యాఖ్యాలు చేశారు.
ఈ సందర్భంగా పాల్ లాంటి ఆదర్శ వ్యక్తి ఎక్కడా ఉండరని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మీడియాకి చూపించారు పాల్ ..కేసీఆర్ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు. నేనే అధికారంలోకి రావాలని కేసీఆర్ తన ఇష్టదైవాన్ని కోరుకోవాలంటూ వినూత్న వ్యాఖ్యలు చేశారు. నేను అధికారంలోకి వస్తే తెలంగాణ అప్పులన్నీ తీర్చేస్తానని..తెలంగాణకు ప్రస్తుతం ఉన్న రూ.5లక్షల అప్పులు తీర్చేస్తానని అన్నారు.
దేశం ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉందని అటువంటి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి నేను మాత్రమే తప్పించగలను అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు పాల్. కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకుని కెఏ పాల్ కి సహకరించలని కోరారు. కేసీఆర్ ప్రభువు మార్గంలో నడవాలని పాల్ ప్రార్ధించారు.తెలంగాణ ప్రజల కష్టాలు ప్రభువు తీర్చాలని ప్రార్థించారు. నేనిప్పుడు ఢిల్లీలో ఉన్నా కాబట్టి కేసీఆర్ కు స్వయంగా కేక్ ఇవ్వలేక పోతున్నానని హైదరాబాద్ లో తప్పకుండా కేసీఆర్ ఇంటికి వెళ్లి మరీ కేక్ ఇచ్చి స్వయంగా శుభాకాంక్షలు చెప్పేవాడిని అన్నారు కేఏ పాల్.