KA Paul : ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలిని చంపాలని కుట్ర : కేఏ పాల్
ఆమె చనిపోతే రాజకీయం చేయాలని రాజకీయ పార్టీలు చూస్తున్నాయని ఆరోపించారు. కానీ, తాను ఆమెను బ్రతికిస్తానని స్పష్టం చేశారు.

KA Paul (3)
Durgam Chinnaiah Victim Shejal : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు షెజాల్ ను చంపాలని కుట్ర చేస్తున్నట్లు తనకు తెలిసిందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. షెజాల్ కు మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని అమీర్ పేట వెల్ నెస్ ఆస్పత్రికి కేఏ పాల్ తనతో పాటు తీసుకెళ్లారు.
ఈ మేరకు శుక్రవారం కేఏ పాల్ ఆడియో విడుదల చేశారు. జనాలు అందరూ ప్రేయర్ చేయబట్టి షెజాల్ బ్రతికిందన్నారు. షెజాల్ కుటుంబ సభ్యులు తన దగ్గరకి వచ్చారని తెలిపారు. అందుకే ఆమెను వెల్ నెస్ హాస్పిటల్ లో జాయిన్ చేయించాలని అనుకుంటున్నానని చెప్పారు.
ఆమె చనిపోతే రాజకీయం చేయాలని రాజకీయ పార్టీలు చూస్తున్నాయని ఆరోపించారు. కానీ, తాను ఆమెను బ్రతికిస్తానని స్పష్టం చేశారు. దుర్గం చిన్నయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.