సెల్ఫ్ క్వారంటైన్‌లో మెగాస్టార్ అల్లుడు

  • Published By: sekhar ,Published On : July 2, 2020 / 05:17 PM IST
సెల్ఫ్ క్వారంటైన్‌లో మెగాస్టార్ అల్లుడు

మెగాస్టార్ చిరంజీవి చినల్లుడు, టాలీవుడ్ యంగ్ హీరో కళ్యాణ్ దేవ్ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపాడు. ప్రొషెషన్‌తో పాటు పర్సనల్ లైఫ్ కి కూడా ప్రాధాన్యతనిచ్చే కళ్యాణ్ నిర్మాతల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని కరోనా సమయంలోనూ షూటింగులో పాల్గొన్నాడు. కట్ చేస్తే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయాడు.

భార్య, కుమార్తెలను ప్రమాదంలో పడేయడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని, అందుకే అదే ఇంట్లో విడివిడిగా ఉండాలని నిర్ణయించుకున్నామని కల్యాణ్ దేవ్ తెలిపాడు. అయితే అప్పుడ‌ప్పుడు ఫేస్ టైమ్ ద్వారా వారితో మాట్లాడుతున్నానని, అన్ని పనుల‌ను తానే స్వ‌యంగా చేసుకుంటున్నానని చెప్పాడు. చిరు చిన్నకూతురు శ్రీజను వివాహం చేసుకున్న కళ్యాణ్ ‘విజేత’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ప్రస్తుతం ‘సూపర్ మచ్చి’ చిత్రంలో నటిస్తున్నాడు.

Read:కిలాడి పక్కన కపూర్ ఫిక్స్ అయింది!