Vikram Trailer: కమల్ ఉగ్రరూపం.. గూస్‌బంమ్స్ తెప్పిస్తున్న విక్రమ్ ట్రైలర్!

విశ్వనటుడు కమల్ హాసన్, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ నటిస్తున్న సినిమా విక్రమ్. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Vikram Trailer: కమల్ ఉగ్రరూపం.. గూస్‌బంమ్స్ తెప్పిస్తున్న విక్రమ్ ట్రైలర్!

Vikram Trailer

Updated On : May 15, 2022 / 9:06 PM IST

Vikram Trailer: విశ్వనటుడు కమల్ హాసన్, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ నటిస్తున్న సినిమా విక్రమ్. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, టీజర్లు, ఫస్ట్ సింగల్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా.. తాజాగా చెన్నైలో ఘనంగా నిర్వహించిన ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ చేశారు.

Vikram : కమల్ హాసన్ సాంగ్ పై కేసు నమోదు..

ట్రైలర్ విషయానికి వస్తే.. సింహం, పులి, చిరుతపులి ఒక అడవికి వేటకు వెళితే అని కమల్‌ హాసన్‌ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమయ్యింది. విజయ్‌ సేతుపతి, ఫహద్‌ గ్యాంగ్‌స్టర్స్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. కమల్‌ హాసన్‌ రా ఏజెంట్‌గా కనిపిస్తారని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ఇందులో కమల్‌, విజయ్‌, ఫహద్‌ లుక్స్ ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్స్, టీజర్‌ ఆకట్టుకున్నాయి. కమల్‌కి చాలా రోజుల తర్వాత మంచి హిట్‌ పడబోతుందనే సంకేతాలనిస్తుంది.

Vikram : ఇద్దరు స్టార్ హీరోలతో కమల్ హాసన్ సినిమా.. ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా..

ఇక యాక్షన్ సీన్స్‌కు తగ్గట్లుగా అనిరుధ్‌ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది. ట్రైలర్‌ సినిమాలపై అంచనాలను మరో రేంజ్‌కు తీసుకు వెళ్లింది. ఇక ఈ సినిమాలో మరో తమిళ సూర్య గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్నారని అంటున్నారు. ‘ఖైదీ’, ‘మాస్టర్‌’ చిత్రాల తర్వాత లోకేష్‌ దర్శకత్వం వహించిన సినిమా కావడం, ముగ్గురు విలక్షణ నటులు కలిసి నటించడంతో ‘విక్రమ్‌’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పుడు వచ్చిన ఈ ట్రైలర్‌ ఆ అంచనాలను ఇంకాస్త పెంచేలా ఉంది.