Vikram : కమల్ హాసన్ సాంగ్ పై కేసు నమోదు..

ఈ సినిమా నుంచి ప‌త‌ళ ప‌త‌ళ అనే ఓ మాస్ బీట్ ఉన్న సాంగ్‌ను తమిళ్ లో రిలీజ్ చేశారు. ఈ పాటని కమల్ హాసన్ స్వయంగా రాశారు. ఈ సాంగ్ లిరిక్స్ ఇప్పుడు వివాదానికి

Vikram : కమల్ హాసన్ సాంగ్ పై కేసు నమోదు..

Kamal

Kamalhaasan : క‌మ‌ల్ హాస‌న్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లాంటి స్టార్లతో భారీ మల్టీస్టారర్ ‘విక్రమ్’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు లోకేష్ కనకరాజ్. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా జూన్ 3న విడుదల అవ్వనుంది. మరో స్టార్ హీరో సూర్య కూడా ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఇంతమంది స్టార్ హీరోలు ఒకే సినిమాలో ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవల ఈ సినిమా నుంచి ప‌త‌ళ ప‌త‌ళ అనే ఓ మాస్ బీట్ ఉన్న సాంగ్‌ను తమిళ్ లో రిలీజ్ చేశారు. ఈ పాటని కమల్ హాసన్ స్వయంగా రాశారు. దీనికి అనిరుద్ సంగీతం వహించగా కమల్ హాసన్, అనిరుద్ కలిసి పాడారు. అయితే ఈ సాంగ్ లిరిక్స్ ఇప్పుడు వివాదానికి దారి తీశాయి. ఈ సాంగ్‌లోని కొన్ని ప‌దాలు కేంద్ర ప్ర‌భుత్వాన్ని త‌ప్పు ప‌ట్టేలా, క‌రోనా నిధుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించార‌నేలా ఉన్నాయి అని కొంతమంది అంటున్నారు.

Ranveer Singh : రాజమౌళి అంటూ అరుస్తూ, పొగుడుతూ ఇంటర్వ్యూలో హడావిడి చేసిన బాలీవుడ్ హీరో..

ఈ పాటలోని అర్ధం ప్రజలని తప్పుదారి పట్టించేలా ఉందని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేలా ఉందని చెన్నైకి చెందిన సామాజిక వేత్త సెల్వం ఈ లిరిక్స్‌పై, సినిమాపై కేసు న‌మోదు చేశారు. గతంలో కూడా కమల్ హాసన్ బహిరంగంగానే కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు విమర్శించారు. దీనిపై తమిళనాడు బీజేపీ నాయకులు సైతం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.