Chaitra : నన్ను హింసించాడు.. నా భర్త నుంచి ప్రాణహాని ఉంది.. పోలీసులకి ఫిర్యాదు చేసిన నటి..

కన్నడ ప్రముఖ నటి చైత్ర హలికేరి తన భర్త నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పలు సినిమాలు, సీరియల్స్ తో గురింపు తెచ్చుకున్న కన్నడ నటి చైత్ర హలికేరి.....

Chaitra : నన్ను హింసించాడు.. నా భర్త నుంచి ప్రాణహాని ఉంది.. పోలీసులకి ఫిర్యాదు చేసిన నటి..

Chaitra

 

Chaitra :  కన్నడ ప్రముఖ నటి చైత్ర హలికేరి తన భర్త నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పలు సినిమాలు, సీరియల్స్ తో గురింపు తెచ్చుకున్న కన్నడ నటి చైత్ర హలికేరి భర్త బాలాజీ పొత్రాజ్ తన తండ్రితో కలిసి ఆమె అనుమతి లేకుండా చైత్ర బ్యాంక్ అకౌంట్ ని ఉపయోగించుకున్నారు. ఆమెకు తెలియకుండా బ్యాంక్ లో ఉన్న గోల్డ్ కూడా తీసుకున్నారు. వీరికి ఆ బ్యాంక్ మేనేజర్ కూడా సహకరించారు. ఇదేంటి అని చైత్ర తన భర్తని నిలదీయగా బాలాజీ చైత్రని కొట్టి ఆమెను హింసించాడు.

Simbu : ఆసుపత్రి పాలైన స్టార్ హీరో తండ్రి.. చికిత్స కోసం విదేశాలకు..

దీంతో చైత్ర పోలీసులని ఆశ్రయించింది. తన భర్త, మామ కలిసి తనకి తెలియకుండా తన బ్యాంక్ అకౌంట్ ని వినియోగించుకున్నారని, తన బంగారం తీసుకున్నారని, ప్రశ్నిస్తే హింసించారని తెలిపి, తన భర్త, మామ నుండి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకి ఫిర్యాదు చేసింది. వారికి బ్యాంక్ మేనేజర్ కూడా సహకరించారని అతనిపై కూడా కేసు నమోదు చేసింది. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.