Karnataka: నాలుగోసారీ ఆడపిల్ల పుట్టిందని తండ్రి ఆత్మహత్య

కొడుకును కనాలని చాలా కాలంగా ఆశపడుతున్నాడు ఓ వ్యక్తి. అయితే, అతడికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. నాలుగోసారి అతడి భార్య గర్భం దాల్చింది. ఈ సారైనా కొడుకు పుట్టాలని దేవుడిని వేడుకున్నాడు. తాజాగా, అతడి భార్య కాన్పు కోసం ఆసుపత్రికి వెళ్లింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, నాలుగోసారి కూడా తన భార్య ఆడపిల్లకే జన్మనిచ్చిందంటూ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ భర్త. విస్మయానికి గురి చేస్తున్న ఈ ఘటన కర్ణాటకలోని కోలార్ జిల్లా సత్తిహళ్లీలో చోటుచేసుకుంది.

Karnataka: నాలుగోసారీ ఆడపిల్ల పుట్టిందని తండ్రి ఆత్మహత్య

Alabama shooting

Karnataka: కొడుకును కనాలని చాలా కాలంగా ఆశపడుతున్నాడు ఓ వ్యక్తి. అయితే, అతడికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. నాలుగోసారి అతడి భార్య గర్భం దాల్చింది. ఈ సారైనా కొడుకు పుట్టాలని దేవుడిని వేడుకున్నాడు. తాజాగా, అతడి భార్య కాన్పు కోసం ఆసుపత్రికి వెళ్లింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, నాలుగోసారి కూడా తన భార్య ఆడపిల్లకే జన్మనిచ్చిందంటూ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ భర్త. విస్మయానికి గురి చేస్తున్న ఈ ఘటన కర్ణాటకలోని కోలార్ జిల్లా సత్తిహళ్లీలో చోటుచేసుకుంది.

లోకేశ్ అనే వ్యక్తి తొమ్మిదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని పుంగనూరుకు చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్ల క్రితం వారికి ఆడపిల్ల పుట్టింది. దీంతో అప్పట్లో కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు లోకేశ్. తాను చచ్చిపోతానని తన స్నేహితులతో చెప్పాడు. అప్పట్లో లోకేశ్ కు స్నేహితులు నచ్చచెప్పడంతో ఊరుకున్నాడు.

నాలుగోసారి కొడుకు పుడతాడని భావించాడు. చివరకు ఈసారి కూడా ఆడపిల్లే పుట్టడంతో తీవ్ర నిరాశ, నిస్పృహకు గురయ్యాడు. ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..