Bride wanted :‘మాకు పెళ్లిళ్లు కావట్లేదు..వధువును వెదికి పెట్టండీ’తహసీల్దారుకు వినతిపత్రం

మేడం.. పెళ్లి చేసుకోవాలి వధువును వెదికి పెట్టండీ ప్లీజ్ ’ అంటూ కొంతమంది యువకులు తహసీల్దారుకు వినతిపత్రం అందజేసిన ఘటన వైరల్ గా మారింది.

Bride wanted :‘మాకు పెళ్లిళ్లు కావట్లేదు..వధువును వెదికి పెట్టండీ’తహసీల్దారుకు వినతిపత్రం

Bride Wanted..young Mans Application To Tehsildar

Bride wanted..Young Mans application to tehsildar : పెళ్లి చేసుకోవాలంటే పిల్ల దొరకటంలేదు. దీంతో పెళ్లికాని ప్రసాదుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో కొంతమంది యువకులు తహశీల్దారుకు మొరపెట్టుకున్నారు. ‘మేడం ప్లీజ్ మేం పెళ్లి చేసుకోవాలి..పిల్లలు వెదికి పెట్టండి’అంటూ విన్నవించుకున్నారు.కర్ణాటకలోని తమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకా లక్కగొండన హళ్లి గ్రామంలో జరిగిన ఈ సందర్భం చర్చనీయాంశంగా మారింది.

Read more:ఎమ్మెల్యేగారూ..నాకొక గర్ల్‌ఫ్రెండ్‌ కావాలి..చూసిపెట్టండి సార్…

తహసీల్దారు తేజస్విని నేతృత్వంలో జరిగిన జన స్పందన కార్యక్రమంలో లక్కగొడనహళ్లి తిమ్మాపురం గ్రామానికి చెందిన మంది యువకులు తహసీల్దారుకు ‘మేం వివాహం చేసుకోవాలనుకుంటున్నాం..కానీ ఆడపిల్లలు దొరకటంలేదు..దయచేసి మీరే మాకు వధువులను వెదికి పెట్టండి’ అని రాసి వినతిపత్రం అందించారు. తిమ్మాపుర గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబానికి చెందిన మంది యువకులు తహసీల్దారు తేజస్వినికి ఇటువంటి వినూత్న వినతిపత్రం అందజేశారు. అంతేకాదు ఈ యువకులు గతంలో కూడా తమకూరు జిల్లా అధికారికి కూడా ఇటువంటి వినతిపత్రం ఇచ్చామని చెప్పటం విశేషం.

Read more : కానిస్టేబుల్ లీవ్ గోల : బావమరిది పెళ్లికి వెళ్లాలి..లేకుంటే నా భార్యతో వేగలేను ప్లీజ్ సెలవు ఇవ్వండీ..

కాగా..కర్ణాటకలోని తమకూరు జిల్లాలో చాలామంది యువకులకు వివాహాలు కావటంలేదు. అమ్మాయిల సంఖ్య తగ్గిపోవటందీనికి ఓ కారణమైతే..మరో కారణం అక్కడ ఉండే వ్యవసాయం చేసే యువకులకు పిల్లనిల్వటానికి ఎవ్వరు ముందుకు రాకపోవటం మరో కారణం. ఏదోక చిన్న ఉద్యోగం ఉంటేనే పిల్లనిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయం చేసే యువకులకు పిల్లనివ్వటానికి ఎవ్వరు ఇష్టపడటంలేదు.

Read more : నా ప్రియమైన గేదె ప్రసవించింది..సేవలుచేసి రుణం తీర్చుకోవాలి లీవ్ ఇవ్వండి సార్ : అధికారులకు కానిస్టేబుల్ లెటర్

దీంతో తమకూరు జిల్లాలోని చిక్కనాయకనహళ్లి తాలూకా వ్యవసాయ యువకులు దూర ప్రాంతాల నుంచి పిల్లలను చూసుకుని వివాహం చేసుకుంటున్నారు. అయినా అందరికి వివాహాలు కావటంలేదు.దీంతో వ్యవసాయం చేసే కుటుంబాలకు చెందిన యువకులు తమకు వధువులను వెదికి పెట్టండి అంటూ తహసీల్దారు తేజస్వినికి వినతిపత్రం ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది.