బొమ్మను పెళ్లి చేసుకున్న బాడీబిల్డర్..పాపం విరిగిపోయిన భార్యను రిపేర్ కిచ్చాడట | Kazakhstan

బొమ్మను పెళ్లి చేసుకున్న బాడీబిల్డర్..పాపం విరిగిపోయిన భార్యను రిపేర్ కిచ్చాడట

బొమ్మను పెళ్లి చేసుకున్న బాడీబిల్డర్..పాపం విరిగిపోయిన భార్యను రిపేర్ కిచ్చాడట

kazakhstan bodybuilder who married doll : ఎన్నో విచిత్రమైన పెళ్లిళ్ల గురించి విన్నాం. కానీ ఓ వ్యక్తి ఏకంగా బొమ్మనే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకు పాపం ఆ బొమ్మ పగిలిపోయి ముక్కలైపోయింది. దీంతో ఆ భర్త ముక్కలైపోయిన భార్య (అదేనండీ బొమ్మ’ను పట్టుకుని ఏడ్చాడు. ఆ తరువాత ఆ భార్యను రిపేర్ కిచ్చాడు. రిపేర్ అయిన తన భార్య వచ్చాక ఇద్దరం కలిసి చక్కగా జాలీగా ఉంటామని చెబుతున్నాడు బొమ్మను పెళ్లి చేసుకున్న కిజకిస్థాన్ బాడీ బిల్డర్ యూరీ టోలోచ్కో.


కిజకిస్థాన్ దేశంలో బాడీబిల్డర్ గా పేరు పొందిన యూరి టోలోచ్కో ఓ సెక్సు బొమ్మను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత యూరీకి ఓ వింత ఘటన ఎదురైంది. యూరీ వివాహం సెక్స్ బొమ్మతో గత మార్చిలోనే పెళ్లి జరగాల్సి ఉంది. కానీ కొవిడ్-19 మహమ్మారి వల్ల వారి పెళ్లి లేట్ అయ్యింది. ఎందుకంటే పెళ్లి చేసుకునేది బొమ్మనే అయినా..పెళ్లికి అతిథులు ఉండాలి కదా మరి. అందుకే పెళ్లి జరగటానికి ఆలస్యం జరిగింది.

అలా కోవిడ్ కేసులు తగ్గిన తగ్గిన తరువాత కేవలం 12 మంది అతిథులతో నైట్ క్లబ్ లో యూరి సెక్స్ బొమ్మను వివాహం చేసుకున్నాడు. ఇక్కడ మరో ఘటన యూరీని బాధకు గురిచేసింది. తాను వివాహమాడిన బొమ్మ క్రిస్మస్ పండుగకు ముందు విరిగిపోయింది.

దీంతో పెళ్లి జరిగినా తన భార్యతో సరదాగా గడపలేకపోయాడట. దీంతో ఆ బొమ్మను..కాదు కాదు యూరీ తన భార్యను మరమ్మతులు చేయించేందుకు వేరే నగరానికి పంపించాడు. ఈ విషయాన్ని యూరి స్వయంగా చెప్పాడు.

తన బొమ్మ భార్య కోలుకున్నాక తనతో హ్యాపీ హ్యాపీగా గడుపుతానని చెపుతున్నాడు. బొమ్మతోతన పెళ్లి ఫోటోలను యూరీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. తన బొమ్మ భార్య లేని సెలవురోజుల్లో తన స్నేహితులతో గడుపుతానని యూరి చెబుతున్నాడు.

×