Gender Neutral Uniform : ఆ స్కూల్లో మగపిల్లల్లాగే ఆడపిల్లలకు కూడా షర్టు, త్రిబైఫోర్త్‌ షార్ట్స్‌

ఆ స్కూల్లో మగపిల్లల్లాగే ఆడపిల్లలకు కూడా షర్టు, త్రిబైఫోర్త్‌ షార్ట్స్‌. ఈ వినూత్న యూనిఫామ్ తో గవర్నమెంట్ స్కూల్లో నిశ్శబ్ద విప్లవానికి అడుగులు పడ్డాయి.

10TV Telugu News

Gender Neutral Uniform  In Kerala Govt school : ప్రభుత్వ స్కూళ్లు అయినా ప్రైవేటు స్కూళ్లు అయినా యూనిఫామ్స్ తప్పనిసరి. మగపిల్లలు షర్టు-నిక్కరు లేదా ప్యాంటు వేసుకుంటారు. అదే ఆడపిల్లలు స్కర్టు.. లాంగ్ బ్లౌజ్ లేదా షర్టు వేసుకుంటారు. కానీ కేరళలోని ఓ స్కూల్ వినూత్నంగా ఆలోచించింది. ఆడపిల్లలు, మగపిల్లలు ఒక్కటే అనే ఆలోచన పిల్లల్లో కలగాలని అనుకుంది. అందుకే ఆడపిల్లలు,మగపిల్లలు ఒకేలాంటి యూనిఫామ్స్ వేసుకునేలా చేసింది. ఎందుకంటే లింగ సమానత్వం గురించి ఇప్పటినుంచి అవగాహన కల్పించటానికి. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికుల సహకారంతో ఈ నిశ్శబ్ద విప్లవానికి తొలి అడుగుపడింది కేరళలోని వలయన్చిరంగార ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో..!

ఎర్నాకులం జిల్లాలో వలయన్చిరంగార గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ నిశ్శబ్ద విప్లవానికి శ్రీకారం చుట్టింది. లింగ భేదం లేకుండా విద్యార్థినీ విద్యార్ధులు అందరు ఒకే రకమైన యూనిఫామ్‌ ధరించేలా నిర్ణయం తీసుకుంది. ఆడపిల్లలు మగపిల్లలాగే చొక్కాలు, త్రిబైఫోర్త్‌ షార్ట్స్‌ వేసుకుని చదువులమ్మ ఒడిలో ఒదిగిపోతున్నారు. బాలికలు ఎటువంటి సంకోచం లేకుండా స్వేచ్ఛగా ఆటపాటలతో చదువుకుంటున్నారు. అబ్బాయిలు..అమ్మాయిలు ఒక్కటేననే భావన చిన్ననాటినుంచే కల్పించేందుకు ఇది ఓ సాధనంగా ఉపయోగపడుతుందని చెబుతోంది స్కూల్ సిబ్బంది.

Read more : Skirts for Boys: స్కూల్‌కి స్కర్ట్స్ వేసుకొచ్చిన అబ్బాయిలు.. ఎందుకంటే?

వలయన్చిరంగార గవర్నమెంట్ ప్రైమరీ, ప్రీ-ప్రైమరీ, లోయర్ ప్రైమరీలున్నాయి.రెండింటిలోను మొత్తం 746 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈక్రమంలో మొదటిసారిగా లింగ సమానత్వ యూనిఫామ్‌ 2017లో ప్రీ-ప్రైమరీ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టారు. అది ఇప్పుడు 1 నుంచి 4 క్లాసుల వరకు పొడిగించారు. అలా ఇద్దరు ఒకేలాంటి డ్రెస్సులు వేసుకోవటంతో ఆడపిల్లలు, మగపిల్లల మధ్య తేడాలు మరిచి చక్కగా కలిసి చదువుకుంటు ఆటపాటల్లో కలిసి మెలిసి ఉంటున్నారు.

దీనిపై ఓ టీచర్ మాట్లాడుతు..లింగ సమానత్వ యూనిఫామ్‌ లేకముందు ఆడపిల్లలు..మగపిల్లలు కలిసేవారు కాదనీ..కానీ ఒకేలాంటి యూనిఫామ్స్ వేసుకున్న తరువాత మార్పు వచ్చిందని ఇప్పుడు వారిలో ఎటువంటి సంకోచం లేదని తెలిపారు. విద్యార్ధుల తల్లిదండ్రులతో సమావేశమై వారి అంగీకారంతోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని..అలా జెండర్‌ న్యూట్రల్‌ యూనిఫామ్‌ అమలు చేశామన్నామని తెలిపారు. తమ ఆడపిల్లలు వారు వేసుకునే డ్రెస్ విషయంలో సురక్షితంగా ఉండాలని వారు కోరుకున్నారని..అలా ఈ కొత్త యూనిఫామ్‌ ఖర్చును భరించడానికి కూడా వారు ఇష్టపడ్డారని తెలిపారు.

Read more : Tennis Star Peng : మాజీ ప్రధాని లైంగికంగా వేధించాడు..టెన్నిస్ స్టార్ పెంగ్ భద్రతపై ఆందోళన

జెండర్‌ న్యూట్రల్‌ యూనిఫామ్‌ గురించి హెడ్మాష్టారు సుమ మాట్లాడుతు..‘లింగ సమానత్వ యూనిఫామ్ తో అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందనీ..ఆటల్లో ఇద్దరు కలిసి ఏమాత్రం సంకోచం లేకుండా హ్యాపీగా పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కొత్త డ్రెస్ కోడ్ వారికి గొప్ప స్వేచ్ఛను అందించిందని వారి కలిసి మెలిసి ఉండటంతో మేం తీసుకున్న నిర్ణయం మంచిదేననిపించిందని వెల్లడించారు. మా స్కూల్లో 378 మంది బాలికలు ఉన్నారనీ..వారిలో చాలా మంది పేదవారే. అయినా వారి పిల్లల కోసం వారి తల్లిదండ్రులు కొత్త యూనిఫామ్‌ కోసం అదనపు ఖర్చు పెట్టటానికి ఏమాత్రం ఆలోచించలేదన్నారు. ఈ కొత్త యూనిఫామ్ తో అమ్మాయిలు చాలా హ్యాపీగా ఉన్నారని సుమ తెలిపారు. 2019లోనే జెండర్‌ న్యూట్రల్‌ యూనిఫామ్‌ ప్రవేశపెట్టాలని అనుకున్నప్పటికీ కరోనా కారణంగా కాస్త ఆలస్యమైందని తెలిపారు.

ఈ వినూత్న ఆలోచన గురించి..అకడమిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ బినోయ్ పీటర్ మాట్లాడుతు..ఈ కొత్త డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టడంతోనే ఆగిపోలేదని కేవలం డ్రెస్సులోనే కాకుండా..విద్యార్థులల్లో జెండర్‌-సెన్సిటివ్ పెరగటానికి కూడా చేస్తున్నామని..దానికి సంబంధించి పాఠాలను కూడా సిద్ధం చేశామని…ఉపాధ్యాయులు. బాలురు, బాలికలు ఇద్దరూ సమానమే అని చెప్పేవిధంగా పాఠాలు బోధిస్తున్నామని తెలిపారు. వలయన్చిరంగార పాఠశాల చేపట్టిన ఈ వినూత్న యోచనను..యత్నాన్ని కేరళ విద్యా మంత్రి ఆర్ బిందు, సినీ నటి మంజు వారియర్, ఒలింపియన్ అంజు బాబీ జార్జ్ సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు.

 

×