Tennis Star Peng : మాజీ ప్రధాని లైంగికంగా వేధించాడు..టెన్నిస్ స్టార్ పెంగ్ భద్రతపై ఆందోళన

చైనా టెన్నిస్ స్టార్ ప్లేయర్ పెంగ్ షూయి భద్రతపై సర్వత్రా ఆందోళన నెలకొంది. దేశ మాజీ ప్రధాని జాంగ్ గావోలి లైంగికంగా వేధించినట్లు పెంగ్ చేసిన ఆరోపణలు సంచలనం రేకేత్తిస్తున్నాయి.

Tennis Star Peng : మాజీ ప్రధాని లైంగికంగా వేధించాడు..టెన్నిస్ స్టార్ పెంగ్ భద్రతపై ఆందోళన

Tennis

Tennis Star Peng : చైనా టెన్నిస్ స్టార్ ప్లేయర్ పెంగ్ షూయి భద్రతపై సర్వత్రా ఆందోళన నెలకొంది. దేశ మాజీ ప్రధాని జాంగ్ గావోలి లైంగికంగా వేధించినట్లు పెంగ్ చేసిన ఆరోపణలు సంచలనం రేకేత్తిస్తున్నాయి. పెంగ్ పేరిట రిలీజైన ఓ ఈ మెయిల్ ఆమె భవిష్యత్ పై, పరిస్థితిపై మహిళా టెన్నిస్ సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెంగ్ షూయి పేరిట డబ్ల్యూటీఏకు ఈ మెయిల్ వచ్చినట్లు చైనా మీడియా సంస్థ ప్రసారం చేసిన వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చైనాకు చెందిన సీజీటీఎన్ లో పెంగ్ మెయిల్ ప్రసారం చేసింది.

Read More : Injured Deer Runs to Hospital : కారు ఢీకొని గాయాలు..ఆసుపత్రికి వచ్చి మరీ చికిత్స చేయించుకున్న జింక

పెంగ్ ఆచూకీ కోసం వరల్డ్ టెన్నిస్ సంఘం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కానీ ఆమె ఆచూకీ కనుగొనలేకపోయారని సమాచారం. కనీసం పెంగ్ తో కాంటాక్ట్ కావడానికి యత్నించినా..సఫలం కాలేదని డబ్ల్యూటీఏ వెల్లడించింది. వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ లో మాజీ చాంపియన్. రెండు వారాల క్రితం…మాజీ ప్రధాని జాంగ్ లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు రావడం…తర్వాత…ఆమె ఆనవాళ్లు లేకుండా పోవడంతో టెన్నిస్ అభిమానుల, క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read More : Telangana : బాయిల్డ్ రైస్ కొనం…ఎందుకో కారణాలు చెప్పిన కేంద్రం

టెన్నిస్ దిగ్గజాలు నోవాక్ జకోవిచ్, నవోమి ఒసాకాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మెయిల్ తో పెంగ్ భద్రతపై మరింత ఆందోళన కలుగుతున్నట్లు డబ్ల్యూటీఏ ఛైర్మన్ స్టీవ్ సైమన్ తెలిపారు. నిజంగా పెంగ్ లేఖ రాశారా ? అనే డౌట్స్ వస్తున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే..తాను సురక్షితంగానే ఉన్నట్లు…కేవలం ఇంటి వద్ద రెస్టు తీసుకుంటున్నట్లు అందులో ఉండడం కూడా పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.