Telangana : బాయిల్డ్ రైస్ కొనం…ఎందుకో కారణాలు చెప్పిన కేంద్రం

రబీ సీజన్ ఇంకా ప్రారంభం కాలేదని, ధాన్యం సేకరణపై రాష్ట్రాలతో తాము చర్చించాల్సి ఉందనీ, వచ్చే ఏడాదిలో బియ్యం ఎంత సేకరించాలో నిర్ణయిస్తామనే విషయాన్ని వెల్లడించింది.

Telangana : బాయిల్డ్ రైస్ కొనం…ఎందుకో కారణాలు చెప్పిన కేంద్రం

Rice

Not Buy Boiled Rice In Telangana : ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వం మధ్య వార్ కొనసాగుతోంది. వరి కొనుగోళ్లపై కేంద్రంతో సమరానికి సై అంటోంది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అధికారపక్ష పార్టీ ఏకంగా మహాధర్నా చేపట్టింది. స్వయంగా సీఎం కేసీఆర్ ధర్నాలో పాల్గొని..కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం పండించే వడ్లను కొంటరా ? లేదా ? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

Read More : China-Constructed Enclave : అదిగో.. అరుణాచల్‌లో చైనా రెండో గ్రామం.. శాటిలైట్ ఫొటోలే సాక్ష్యం..!
ధాన్యం సేకరణపై కేంద్ర ఆహార, వినియోగదారుల శాఖ వివరాలను వెల్లడిచింది. గతంలో తెలంగాణ రాష్ట్రం నుంచి 60 లక్షల టన్నుల ధాన్యం, 40 లక్షల టన్నుల బియ్యం సేకరించాలనే నిర్ణయం తీసుకున్నామని..రాష్ట్రాల చర్చలు జరిపిన తర్వాతే..నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపింది. రబీ సీజన్ ఇంకా ప్రారంభం కాలేదని, ధాన్యం సేకరణపై రాష్ట్రాలతో తాము చర్చించాల్సి ఉందనీ, వచ్చే ఏడాదిలో బియ్యం ఎంత సేకరించాలో నిర్ణయిస్తామనే విషయాన్ని వెల్లడించింది. అయితే..ఒక్కో రాష్ట్రం డిమాండ్ ఒక్కో విధంగా ఉందని…గత నిర్ణయాల ప్రకారమే…ఇప్పటి వరకు బాయిల్డ్ రైస్ సేకరిచండం జరిగిందని తెలిపింది.

Read More : Fraud Alert : ఆన్‌‌లైన్ యాప్ మోసం..రూ. 36 లక్షలు పొగొట్టుకున్న హైదరాబాద్ వాసి

ఇకపై బాయిల్డ్ రైస్ కొనడం జరగదని, వరి, గోధుమ పంటలను తక్కువగా పండించాలని తాము రైతులకు సూచించడం జరుగుతోందని పేర్కొంది. దీనికి గల కారణం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో సరిపడా బియ్యం, గోధుమ నిల్వలున్నాయని..ఇంకా నిల్వ చేసే పరిస్థితి లేదని తేటతెల్లం చేసింది. ఎగుమతుల మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని, ఎగుమతలకు కూడా కొన్ని పరిమితులుంటాయనే విషయాన్ని చెప్పింది. నూనె, పప్పు ధాన్యాల పంటలను తక్కువగా పండించాలని, అన్ని రాష్ట్రాలకు ఇదే సూచించడం జరుగుతోందని ఆ శాఖ పేర్కొంది.