covaxin vs covishield : కొవాగ్జిన్ రెండు డోసులూ వేయించుకుని..కొవిషీల్డ్ టీకా వేయాలంటూ కోర్టుకెళ్లిన వ్యక్తి

అల్రెడీ కోవాగ్జిన్ రెండు డోసులు వేయించుకున్న ఓ వ్యక్తి తనకు కోవీషీల్డ్ వ్యాక్సిన్ కూడా వేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు.

covaxin vs covishield : కొవాగ్జిన్ రెండు డోసులూ వేయించుకుని..కొవిషీల్డ్ టీకా వేయాలంటూ కోర్టుకెళ్లిన వ్యక్తి

Covaxin Vs Covishield

covaxin vs covishield : కరోనా నియంత్రణ కోసం వ్యాక్సిన్ వ్యాక్సిన్ వేయించుకుంటున్నాం. కొంతమంది కోవాగ్జిన్ వేయించుకుంటుంటే మరికొందరు కోవిషీల్డ్ వేయించుకుంటున్నారు. ఏది వేయించుకోవాలి?అనేది వారి వారి ఇష్టాలతో వేయించుకుంటున్నారు. కానీ ఓ రకం వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నా నాకు మరో రకం వ్యాక్సిన్ కూడా వేయాలని అడిగాడు. దానికి ఆరోగ్య కేంద్రాలు ఇప్పటికే మీకు రెండు డోసులు పూర్తి అయ్యాయి. ఇక రెండో రకం వేయిం అని చెప్పారు.దానికి సదరు వ్యక్తి మాత్రం ‘‘నేను కోవాగ్జిన్ రెండు డోసులు వేయించుకున్నాను. ఇప్పుడు నాకు కోవీషీల్డ్ వేయాలని కోరుతూ కేర‌ళ హైకోర్టును ఆశ్రయించాడు. ఇంతకీ అతను రెండో రకం వ్యాక్సిన్ కూడా వేయించుకోవాలని ఎందుకనుకుంటున్నాడంటే..

కేర‌ళ‌లోని కన్నూర్ కు చెందిన గిరికుమార్ టెక్కన్ కున్నుంపురత్ అనే 50 ఏళ్ల వ్యక్తి సౌదీ అరేబియా నుంచి వచ్చాడు. ఇప్పుడు అంతర్జాతీయ విమానాలు కూడా సర్వీసులు ప్రారంభించటంతో తిరిగి సౌదీ అరేబియాకు పయనమయ్యాడు. సౌదీ వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. అతను అప్ప‌టికే కొవాగ్జిన్ రెండు డోసుల వ్యాక్సినూ వేయించుకున్నాడు. కానీ సౌదీ అరేబియాలో కొవాగ్జిన్‌ను గుర్తించ‌డం లేదు. ఆగస్టు 30 లోపు అతను సౌదీ వెళ్లాల్సి ఉంది.

దీంతో మ‌రోసారి సదరు వ్యక్తి కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి వెళ్లగా ఆల్రెడీ రెండు డోసులు పూర్తి అయ్యా కాబట్టి మరో రకం వ్యాక్సి వేయం అని చెప్పారు.దాంతో అతను ‘‘తాను కోవాగ్జిన్ రెండు డోసులు వేయించుకున్నాను..కానీ నేను సౌదీ వెళ్లాలంటే కోవీషీల్డ్ కూడా వేయించుకోవాల్సి ఉంది. కాబట్టి నాకు కోవీషీల్డ్ టీకా వేయించాలని కోరుతూ కేర‌ళ హైకోర్టును ఆశ్ర‌యించాడు. ఈ విష‌యంలో ధర్మాసనం కూడా ఏం చెప్పాలో తెలియక ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై నిపుణులతో చర్చించి ఏం చేయాలో తెల‌పాలంటూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా గిరి కుమార్ కోవాగ్జిన్ మొదటి డోసు ఏప్రిల్ 17న వేయించుకోగా ఆ తరువాత నెలకు రెండో డోసు వేయించుకున్నాడు. తాను ఆగస్టు 30కి సౌదీ వెళ్లాలనే విషయాన్ని కోర్టుకు తెలియజేశాడు.