Kirak Rp : బిజినెస్ ఎక్కువ సక్సెస్ అయిందని కర్రీ పాయింట్ ని క్లోజ్ చేసిన జబర్దస్త్ కమెడియన్

కర్రీ పాయింట్ అనుకోనంత ఎక్కువగా సక్సెస్ అయింది. రోజా వండినవే సరిపొవట్లేదంట, ఇంకా జనాలు వస్తున్నారంట, లాభాలు కూడా బాగా వస్తున్నాయంట అయినా ఆర్పీ ఈ కర్రీ పాయింట్ ని క్లోజ్ చేయడం విశేషం. కూకట్ పల్లిలో చాలా సింపుల్ గా చిన్నగా ఈ కర్రీ పాయింట్ ని...............

Kirak Rp : బిజినెస్ ఎక్కువ సక్సెస్ అయిందని కర్రీ పాయింట్ ని క్లోజ్ చేసిన జబర్దస్త్ కమెడియన్

Kirak Rp closed his curry point nellore peddareddy chepala pulusu due to heavy rush

Updated On : January 3, 2023 / 7:40 AM IST

Kirak Rp :  జబర్దస్త్ తో బాగా ఫేమ్ తెచ్చుకున్నాడు ఆర్టిస్ట్ కిరాక్ ఆర్పీ. అనంతరం వేరే టీవీ షోలు, సినిమాలలోనూ కనిపిస్తూ త్వరలో దిరెచ్తిఒన్ కూడా అచేయబోతు బిజీగా ఉన్నాడు ఆర్పీ. ఇటీవలే కొన్ని రోజుల క్రితం తాను ప్రేమించిన అమ్మాయిని నిశ్చితార్థం చేసుకొని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా ప్రకటించాడు. అయితే కొన్ని రోజుల క్రితమే కిరాక్ ఆర్పీ ఫుడ్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు. హైదరాబాద్ లో ఫుడ్ బిజినెస్ కి మంచి డిమాండ్ ఉంది. అందులోను కర్రీపాయింట్స్ కి ఇంకా ఎక్కువ డిమాండ్.

కిరాక్ ఆర్పీది నెల్లూరు కావడంతో అక్కడి ఫేమస్ నెల్లూరు చేపల పులుసుని ఇక్కడి వాళ్ళకి అదే టేస్ట్ తో అందచేయాలని కూకట్ పల్లిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరుతో ఓ కర్రీ పాయింట్ ని గ్రాండ్ గా ఓపెన్ చేశాడు. ఈ కర్రీ పాయింట్ లో అన్ని చోట్ల దొరికే కర్రీలతో పాటు చేపల ఐటమ్స్ చాలా స్పెషల్స్. చేపల పులుసు, బొమ్మిడాయిల పులుసు, కొరమీను పులుసు, సన్నచేపల పులుసు, రవ్వ చేపల పులుసు, చేప తలకాయ పులుసు.. ఇలా అన్నీ నెల్లూరు నుంచి తెప్పించిన చేపలతో కట్టెలపొయ్యి మీదనే వండుతారట. ఈ కర్రీ పాయింట్ బాగా క్లిక్ అయితే హైదరాబాద్ లోనే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్స్‌ మరో 15 బ్రాంచులు ఓపెన్‌ చేస్తానని గతంలో తెలిపాడు కిరాక్ ఆర్పీ.

అయితే ఈ కర్రీ పాయింట్ అనుకోనంత ఎక్కువగా సక్సెస్ అయింది. రోజా వండినవే సరిపొవట్లేదంట, ఇంకా జనాలు వస్తున్నారంట, లాభాలు కూడా బాగా వస్తున్నాయంట అయినా ఆర్పీ ఈ కర్రీ పాయింట్ ని క్లోజ్ చేయడం విశేషం. కూకట్ పల్లిలో చాలా సింపుల్ గా చిన్నగా ఈ కర్రీ పాయింట్ ని ఓపెన్ చేశాడు ఆర్పీ సాధారంగానే రోజూ వండినా ఊహించని దానికంటే ఎక్కువమంది రావడంతో ఉన్న జనాలతో మెయింటైన్ చేయలేక, అంతమందికి ఫుడ్ అందించలేక, షాప్ దగ్గర జనాలు ఎక్కువ అయిపోవడంతో కిరాక్ ఆర్పీ ఈ కర్రీ పాయింట్ ని మూసేశాడు.

Samantha : చాలా రోజుల తర్వాత అభిమానులతో ముచ్చటించిన సమంత..

దీనిపై కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ.. నేను అనుకున్న దానికంటే కర్రీ పాయింట్ బాగా ఎక్కువే సక్సెస్ అయింది. కానీ వచ్చే జనాలందరికి అందించలేకపోతున్నాను అని బాధపడుతున్నాను. అందుకే కిచెన్ కెపాసిటీని పెంచి మరికొంతమంది మహిళలని చేపల పులుసుని వండటానికి నెల్లూరు నుంచి తెప్పించి నెల రోజుల్లో మరింత భారీగా ఓపెన్ చేస్తాను అని తెలిపాడు. దీంతో బిజినెస్ ఎక్కువయితే అది రన్ చేస్తూనే అది పెంచుకునే చర్యలు తీసుకోవాలి కానీ ఇలా క్లోజ్ చేసి మరీ మరింత భారీగా ఓపెన్ చేయడమేంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి ఆర్పీ మాత్రం తన నెల్లూరు చేపల పులుసుతో బాగానే సక్సెస్ అయ్యాడు. త్వరలో మరింత సక్సెస్ కాబోతున్నాడు.