Bullet Bandekki Song : ఫోన్‌లో బుల్లెట్టు బండి పాట పెడితేనే.. పాలు తాగుతోంది
మహబూబాబాద్ మంలం కంబాలపల్లి గ్రామంలో ఓ కొండెంగ మొబైల్ ఫోన్‌లో బుల్లెట్టు బండి పాట పెడితేనే పాలు తాగుతోంది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Bullet Bandi
Bullet Bandekki song : ‘బుల్లెట్టు బండెక్కి’పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల విస్తృత ప్రచారం సంతరించుకున్న ‘బుల్లెట్టు బండెక్కి’పాటకు అందరూ ఆకర్షితులవుతున్నారు. అయితే మనుషులనే కాకుండా జంతువులను కూడా ఆకర్షిస్తోంది. ఆ పాట వినాలని జంతువులు కూడా పరితపిస్తున్నాయి. ఓ కొండెంగ.. బుల్లెట్లు బండి పాటకు ఫిదా అయింది.
మహబూబాబాద్ మంలం కంబాలపల్లి గ్రామంలో ఓ కొండెంగ మొబైల్ ఫోన్‌లో బుల్లెట్టు బండి పాట పెడితేనే పాలు తాగుతోంది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొబైల్ ఫోన్‌లో పాటను చూస్తూ ఆ కొండెంగ పాలు తాగడాన్ని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా…డుగ్గు…డుగ్గు..డుగ్గు..డుగ్గు అనే ప్రయివేట్ ఆల్బమ్ సాంగ్‌కు వధువు చేసిన డ్యాన్స్ చూసి సోషల్ మీడియాను ఊపేసిన సంగతి తెలిసిందే. పెళ్లి బరాత్ లో ఈమె చేసిన డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ డ్యాన్స్ చేసిన యువతికి ఓ బంపర్ ఆఫర్ వచ్చేసింది. తాము నిర్మించే తదుపరి పాటకు డ్యాన్స్ చేయాలని సంస్థ నిర్వాహకులు ఆమెకు ఆఫర్ ఇచ్చారు. వచ్చిన ఆఫర్ తో ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆమె డ్యాన్స్ చేసిన పాటను ‘బ్లూ రాబిట్ ఎంటర్ టైన్ మెంట్’ నిర్మించింది. లక్ష్మణ్ (రచయిత) సాహిత్యానికి ఎస్ కే బాజీ సంగీతం అందించారు. ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు. ఈ పాటను ఆ సంస్థ అద్భుతంగా తెరకెక్కించింది. తాజాగా..సంస్థ నిర్వాహకులు నిరూప స్పందించారు. సాయి శ్రియతో నిరూప ఫొన్ లో మాట్లాడారు. తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించే పాటకు నటించాలని చెప్పడంతో సాయి శ్రియ సంతోషం వ్యక్తం చేసింది. దీంతో సాయి శ్రియ ప్రధాన పాత్రలో ఓ పాట రాబోతోంది.