Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Movies

‘క్షణ క్షణం’ సినిమా పెద్ద హిట్ కావాలి – అల్లు అరవింద్..

Updated On - 8:10 pm, Wed, 24 February 21

Kshana Kshanam: మన మూవీస్ బ్యానర్‌లో ఉదయ్ శంకర్, జియా శర్మ హీరో హీరోయిన్లుగా కార్తీక్ మేడికొండ దర్శకత్వంలో డాక్టర్ వర్లు నిర్మించిన సినిమా ‘క్షణ క్షణం’. డార్క్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 26న గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘క్షణ క్షణం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులతో పాటు నిర్మాత అల్లు అరవింద్, సిరివెన్నెల సీతారామశాస్త్రి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం శ్రీరామ్ గారు. ఆయన నాకు గురు సమానులు. వారి అబ్బాయి ఉదయ్ హీరోగా నటిస్తున్న ఈ ‘క్షణ క్షణం’ సినిమా బాగుందని విన్నాను. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు పని చేసిన అందరూ నటీనటులకు టెక్నీషియన్స్‌కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. నిర్మాతగా మారిన డాక్టర్ వర్లు గారు మరిన్ని సక్సెస్‌ఫుల్ సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నాను’’.. అన్నారు.

Kshana Kshanam

ప్రసిద్ధ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరి జీవితంలో కొందరు హీరోలుంటారు. నా జీవితంలో అలాంటి హీరో అల్లు అరవింద్ గారు. సినిమా పిచ్చోడి చేతిలో రాయి కాదు గమ్యం, గమనం సరిగ్గా ఉంటే ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోవచ్చని అరవింద్ గారు నిరూపించారు. ఎంతోమంది రీల్ హీరోలను తయారుచేశారు. గెలుపు ఓటమి అనే రెండు పదాలకు నిర్వచనం, అర్థం లేదు. గెలవడం అంటే యుద్ధానికి సిద్ధం కావడం. ఆ తర్వాత ఓడామా గెల్చామా అనేది ముఖ్యం కాదు. ఒకడు యుద్ధానికి సిద్ధమయ్యాడూ అంటే గెల్చినట్లే లెక్క. ఇలా ఒక ఇష్టాన్ని అనుసరిస్తూ సినిమా చేసిన ఉదయ్ ఇప్పటికే గెలిచేశాడు. ఇక కమర్షియల్ లెక్కలు అవీ తర్వాత, తన లక్ష్యం వైపు అతను వేసిన అడుగే గెలిచినట్లు చేసింది. ఉదయ్ పట్టుదల ఉండి శ్రమించే వ్యక్తి. అతనికి నా ఆశీస్సులు ఉంటాయి. ఉదయ్ మరింత పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో పనిచేసిన నా మరో ఆత్మీయుడు సంగీత దర్శకుడు కోటి. మా ఇద్దరి కెరీర్ దాదాపు ఒకేసారి ప్రారంభమైంది. రోషన్.. తండ్రి కోటి లక్షణాలు పుణికి పుచ్చుకున్నాడు. మంచి మ్యూజిక్ చేశాడు. డాక్టర్ వర్లు గారితో నాకు పరిచయం లేదు గానీ ఆయనతో ఎప్పటినుంచో స్నేహం ఉన్న అనుభూతి కలుగుతోంది. ‘క్షణ క్షణం’ సినిమాలో ఏదో విషయం ఉంది. ఫీల్ గుడ్ సినిమా అనిపిస్తోంది’’.. అన్నారు.

నిర్మాత డాక్టర్ వర్లు మాట్లాడుతూ.. ‘‘నిర్మాత అల్లు అరవింద్ గారు, సంగీత దర్శకులు కోటి గారు, రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈ కార్యక్రమానికి హాజరు అవ్వడం సంతోషం. పర్సనాలిటీ డెవలప్ మెంట్ టీచర్ అయిన నేను నిర్మాతగా మారడానికి కారణం మా గురువు శ్రీరామ్ సార్. ఆయన కోసం వారి అబ్బాయి ఉదయ్‌తో నేను నిర్మాతగా మారి ‘క్షణ క్షణం’ సినిమా తీశాను. సినిమాల పట్ల ఆసక్తితో ఉదయ్ నటుడయ్యాడు, తను మంచి నటుడితో పాటు మంచి మేధావి. ఈ సినిమా విషయానికి వస్తే చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఆడియన్స్ థ్రిల్స్ ఫీల్ అవుతారు’’.. అని తెలిపారు.

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ.. ‘‘క్షణం క్షణం’ నా మూడో సినిమా. అనుకోకుండా విన్నా ఈ సినిమా నాకు బాగా నచ్చింది. నాకు నటన పరంగా ఎక్కువ స్కోప్ ఉన్న కథ ఇది. ఈ సినిమా నేనెందుకు చేయకూడదనిపించి వెంటనే ఈ సినిమా స్టార్ట్ చేశాం. కేవలం ఇరవై ఆరు వర్కింగ్ డేస్‌లో సినిమా ఫినిష్ చేశాం. మాకు సపోర్ట్ చేసిన అల్లు అరవింద్ గారికి బన్నీ వాసు గారికి ధన్యవాదాలు. వెంకటేష్ గారు మా సినిమా బాగుందని సోషల్ మీడియాలో షేర్ చేశారు. మా సినిమాతో పాటు వస్తున్న అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా థియేట‌ర్స్ వ‌ర‌కూ వ‌స్తుందంటే అల్లు అర‌వింద్ గారి స‌పోర్ట్‌తోనే సాధ్యం అయ్యింది. ఫిబ్రవరి 26న వస్తున్న మా ‘క్షణ క్షణం’ చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు’’.. అన్నారు.

Kshana Kshanam

మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూ.. ‘‘నన్ను నటుడిగా కార్తీక్ పరిచయం చేస్తున్నాడు. నన్నుచాలా కంఫర్ట్ చేసి నాతో యాక్ట్ చేయించుకున్నాడు. అంద‌రూ బాగా వ‌చ్చింది అని అంటుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ పాత్ర‌కు మంచి స్పంద‌న వ‌స్తే న‌టుడిగా నా ప్ర‌యాణం కొన‌సాగిస్తాను. రోష‌న్ ఇచ్చిన మ్యూజిక్‌కి చాలా ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి, తండ్రిగా నాకుచాలా ఆనందంగా ఉంది’’.. అన్నారు.

హీరోయిన్ జియా శర్మ మాట్లాడుతూ.. ‘‘అర్జున్ రెడ్డి’ తో తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందగలిగాను. ‘క్షణ క్షణం’ తో మరింత దగ్గర అవుతాననే నమ్మకం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కార్తికేయ, నిర్మాతలు వర్లు, చంద్ర మౌళిలకు థ్యాంక్స్. మరిన్ని తెలుగు సినిమాలలో భాగం అవ్వాలని కోరుకుంటున్నాను. ‘క్షణ క్షణం’ మిమ్మల్ని తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుంది. 26న థియేటర్లలో కలుద్దాం’’.. అన్నారు.

డైరెక్టర్ మేడికొండ కార్తిక్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఈవెంట్‌కు వచ్చిన అందరికి ధన్యవాదాలు. ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్న నిర్మాత వర్లు గారికి, మ‌న్నెం చంద్ర‌మౌళి గారికి థ్యాంక్స్. ఇలాంటి స్క్రిప్ట్‌ని ఎంచుకోవ‌డానికి చాలా ధైర్యం కావాలి. అలాంటి ధైర్యం మా ప్రొడ్యూస‌ర్స్‌కి ఉంది. హీరో ఉదయ్ ఈ సినిమాను నమ్మి చేశాడు. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ‘క్షణ క్షణం’ సినిమా ఎవ్వరినీ డిజప్పాయింట్ చెయ్యదు. మా సినిమాను మీ అందరూ సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్నాను’’.. అన్నారు.

Kshana Kshanam

దర్శకుడు రామరాజు మాట్లాడుతూ.. ‘‘నాకు చంద్రమౌళి ఆప్తుడు. నా ‘మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు’, ‘ఒక మనసు’ సినిమాలు అంతగా ప్రజల్లోకి వెళ్లాయంటే కారణం ఆయనే. ఈ సినిమా ప్రయాణంలో నాకు పరిచయం అయిన మరో గొప్ప వ్యక్తి డాక్టర్ వర్లు గారు. నాకు ఈ సినిమా గురించి గత ఆర్నెళ్లుగా చెబుతూనే ఉన్నారు. మౌళి గారికి సినిమా మీద చాలా అవగాహన ఉంది. చాలా ఇన్వాల్వ్ అయి, అందంగా సినిమాను చేశారు. మీరు ఎంత కష్టపడ్డారో తెలుసు. ఉదయ్ శంకర్ గారు మేథమెటిక్స్‌లో మాస్టర్.. ఆయన సినిమా వైపు వచ్చారంటే ఏదో దైవిక ఆలోచన ఉండాలి. మీరు సినిమా ప్రాసెస్‌ను ఎంజాయ్ చేసి ఉంటారు. మౌళి గారికి వర్లు గారికి మీకు అందరికీ నా బెస్ట్ విషెస్’’.. అన్నారు.

ఎడిటర్ గోవింద్ మాట్లాడుతూ.. ‘‘స్క్రీన్‌ప్లే బాగుంటే ఎడిటింగ్ కూడా బాగుంటుంది. ‘క్షణ క్షణం’ సినిమాకు మంచి స్క్రీ‌న్‌ప్లే ఇచ్చారు కార్తీక్ గారు. అలాగే నాకీ సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన డాక్టర్ వర్లు గారికి, మౌళి గారికి థ్యాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. 26వ తేదీన సినిమా చూసి సపోర్ట్ చేయమని కోరుకుంటున్నా’’.. అన్నారు.

రఘు కుంచె మాట్లాడుతూ.. ‘‘నటుడిగా ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నాను. దర్శకుడు కార్తీక్ నాకు మంచి పాత్ర ఇచ్చాడు. నా పాత్ర గురించి ఇప్పుడే చెప్పలేను, కానీ చాలా బాగా వచ్చింది అని చెప్పగలను. రోషన్ మ్యూజిక్ చాలా బాగా వచింది. సాంగ్స్ బాగా పాపులర్ అవుతున్నాయి’’.. అన్నారు.

Kshana Kshanam

300x250 Sub TelDrcarebanner 300x250 Dow
11 Covid Patients Died Due To Oxygen Supply
Latest25 mins ago

11 Covid Patients Death : తమిళనాడులో విషాదం.. ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు మృతి

Mahatma Gandh Personal Secretary
Latest33 mins ago

మహాత్మా గాంధీ కార్యదర్శి కల్యాణం కన్నుమూత

Mbbs Students On Covid Duty
Latest49 mins ago

MBBS Students : ఎంబీబీఎస్ విద్యార్థులకు కొవిడ్ డ్యూటీ.. నెలకు రూ.3వేలు ఇన్సెంటివ్‌

Covid Patients Crematorium
Latest57 mins ago

కరోనా రోగుల మృతదేహాలకు ఉచితంగా కలప

Dmk Files Compliant To Police On Own Party Workers
Latest1 hour ago

DMK Compliant : పార్టీ కార్యకర్తలపై డీఎంకే వేటు.. పోలీసులకు ఫిర్యాదు

Covid Vaccine
Latest2 hours ago

Covid Vaccine fake URLs: వ్యాక్సిన్ కోసం ఫేక్ యాప్‌లు నమ్మకండి

Cm Kcr Cured From Covid 19
Latest2 hours ago

CM KCR : కరోనాను జయించిన సీఎం కేసీఆర్..

Home Isolation
Andhrapradesh2 hours ago

Home Isolation: లక్ష మందికి పైగా హోం ఐసోలేషన్‌లోనే కొవిడ్ రోగులు

Situation Very Desperate In India, Depoly Army Immediately Top Us Covid Expert Anthony
International2 hours ago

India Covid Situation: దేశంలో కరోనా కల్లోలం.. సైన్యాన్ని దించండి..

Corona Treatment Children
Latest2 hours ago

Corona Treatment: చిన్నారులకు ఆ మందులు అస్సలు వాడొద్దు

Icmr Issues New Guidlines On Covid 19 Tests
Latest3 hours ago

ICMR New Guidelines : కరోనా టెస్టులపై ఐసీఎంఆర్‌ కొత్త మార్గదర్శకాలు ఇవే..

Andhra Pradesh Day Curfew Start From Today
Andhrapradesh3 hours ago

AP Day Curfew : ఏపీలో డే కర్ఫ్యూకు కౌంట్ డౌన్ మొదలైంది..

Covid Double Mutant
Andhrapradesh3 hours ago

Covid Double Mutant: తెలుగు రాష్ట్రాల్లో ఉందంతా డబుల్ మ్యూటెంటే..

Mla Rekhanaik Corona
Latest9 hours ago

MLA Rekhanaik Corona : ఎమ్మెల్యే రేఖానాయ‌క్ కు క‌రోనా పాజిటివ్

Corona cases in Kerala
National9 hours ago

Corona Cases Kerala : కేరళలో 24 గంటల్లో 37,190 కరోనా కేసులు

Pooja Hegde
Latest2 weeks ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Mahlagha Jaberi Bikini Pics
Latest4 weeks ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest4 weeks ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest4 weeks ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest2 months ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest2 months ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest2 months ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest2 months ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest2 months ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest2 months ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest2 months ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest2 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Supreme Court Asks Centre Govt To Think On Imposing Lockdown
Exclusive Videos2 days ago

కరోనా కట్టడికి లాక్ డౌన్ పెట్టాలి

Covid 19 Task Force
Exclusive Videos2 days ago

భారత్‌లో లాక్‌డౌన్ పెట్టాల్సిందే..

Rt Pcr Test Of Kcr
Exclusive Videos5 days ago

కేసీఆర్ కరోనా ఫలితాల్లో అస్పష్టత

Maruthi 800 Modified As Lamborghini
Exclusive Videos5 days ago

మారుతీ 800 కారు ఇప్పుడు లాంబోర్గిని

Station Ghanpur
Exclusive Videos5 days ago

కుక్కలకు బిస్కెట్స్ విసిరినట్టు.. కరోనా రోగులకు ట్యాబ్లెట్లు విసిరేస్తున్నారు

In
Exclusive5 days ago

భారత్ థర్డ్ వేవ్‌ను తట్టుకుంటుందా?

Pm Modi To Hold Cabinet Meet Over Corona Situation
Exclusive5 days ago

కరోనాపై మోడీ కేబినెట్ మీట్

Drdo To Set Up 500 Oxygen Plants
Exclusive6 days ago

గాలితో ఆక్సిజ‌న్.. నిమిషానికి వెయ్యి లీట‌ర్ల ఆక్సిజ‌న్ త‌యారీ

China
Exclusive6 days ago

చైనా ఆహ్వానాన్ని తిర‌స్క‌రించిన భార‌త్

Vaccine
Exclusive6 days ago

రూ.400 నుంచి రూ.300కి దిగొచ్చిన కొవిషీల్డ్

New
Exclusive6 days ago

కొత్తగా 3.79 లక్షల కేసులు

Hetero Pharmacy Deal
Exclusive Videos7 days ago

క‌రోనాకు ట్యాబ్లెట్: భార‌త్, ఇత‌ర దేశాల‌తో బిగ్ డీల్

Massive Earthquake
Exclusive Videos7 days ago

అసోంలో భారీ భూకంపం

Kims Md Bhaskar Rao On Corona Patients
Exclusive Videos7 days ago

90% బతికే అవకాశమున్నప్పుడే వెంటిలేటర్ బెటర్

Collector Shailesh Kumar Yadav
Exclusive Videos7 days ago

అతిథిగా వ‌చ్చిన క‌లెక్ట‌ర్..పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుపై కేసులు

300x250 Down