Lata Mangeshkar: విషమంగా లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి

వెటరన్ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు వైద్య నిపుణులు. గత నెల అనారోగ్యంతో ముంబైలోని హాస్పిటల్ ఐసీయూ వార్డులో అడ్మిట్ అయ్యారు.

Lata Mangeshkar: విషమంగా లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి

Lata

Lata Mangeshkar: వెటరన్ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు వైద్య నిపుణులు. గత నెల అనారోగ్యంతో ముంబైలోని హాస్పిటల్ ఐసీయూ వార్డులో అడ్మిట్ అయ్యారు. అప్పటి నుంచి బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ సిబ్బంది అప్ డేట్ ఇస్తూ.. ఆరోగ్య పరిస్థితి కుదుటపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు.

‘సింగర్ లతా మంగేష్కర్ పరిస్థితి మరోసారి విషమంగా మారింది. వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నాం’ అని డాక్టర్ ప్రతీత్ సాంధానీ వెల్లడించారు. వారం క్రితమే వెంటిలేటర్ లేకుండానే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. 92ఏళ్ల వయస్సున్న లతా మంగేష్కర్ జనవరి తొలి వారంలో కొవిడ్ తో బాధపడుతూ హాస్పిటల్ లో చేరారు.

హాస్పిటల్ లో చేరిన కొద్ది రోజులకు కొవిడ్ నుంచి కోలుకున్న ఆమె.. న్యూమోనియాకు గురయ్యారు. వారం క్రితమే ఎటువంటి సమస్య లేదని ఆరోగ్య పరిస్థితి మెరుగైందని వైద్యులు వెల్లడించారు. ఆరోగ్యం కుదుటపడి రికవరీ అవుతున్నారనుకున్న తరుణంలో మరోసారి విషమంగా మారింది.

త్వరలో పూర్తి రికవరీతో బయటకు రావాలని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

Read Also: ఫినాలే ఎపిసోడ్.. కళ్లు చెమ్మగిల్లేట్టు బాలయ్య వ్యాఖ్యలు!

నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు దక్కించుకున్న లతా..కు భారత అత్యున్నత పురస్కారమైన భారత రత్న కూడా ఇచ్చారు. ఆమెకు పద్మ భూషణ్ కూడా దక్కింది. ఇవే కాక పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు పలు జాతీయ అవార్డులు ఆమెను వరించాయి.