Devarayamjal Land Scam : రామారావు ఇమ్మానేని నుంచి కీలక ఆధారాలు

ఈటల కేసులో న్యాయవాది రామారావు ఇమ్మానేని నుంచి కీలక ఆధారాలు సేకరిస్తున్నారు విజిలెన్స్ అధికారులు. గంటకు పైగా రామచంద్రాపురం విజిలెన్సు కార్యాలయంలో న్యాయవాది రామ రావు ఇమ్మానేనిని ఉన్నారు. దేవరాయాంజాల్ సర్వే నెంబర్ 56, 57, 58 కి సంబంధిత కీలక పత్రాలను విజిలెన్సు అధికారులకు రామారావు అందించారు.

Devarayamjal Land Scam : రామారావు ఇమ్మానేని నుంచి కీలక ఆధారాలు

Etela Jamuna

Lawyer Rama Rao Immaneni : ఈటల కేసులో న్యాయవాది రామారావు ఇమ్మానేని నుంచి కీలక ఆధారాలు సేకరిస్తున్నారు విజిలెన్స్ అధికారులు. గంటకు పైగా రామచంద్రాపురం విజిలెన్సు కార్యాలయంలో న్యాయవాది రామ రావు ఇమ్మానేనిని ఉన్నారు. దేవరాయాంజాల్ సర్వే నెంబర్ 56, 57, 58 కి సంబంధిత కీలక పత్రాలను విజిలెన్సు అధికారులకు రామారావు అందించారు.

రామచంద్రపురం విజిలెన్సు కార్యాలయంలో పత్రాల విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాముని భూములు రామునికే చెందాలని విజిలెన్స్ అధికారులకు న్యాయవాది తెలిపారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పరిధిలో ఉన్న నిషేధిత దేవాలయ భూములు అక్రమంగా ఈటల జామున రిజిస్ట్రేషన్ చేసుకున్నారని న్యాయవాది వెల్లడించారు. పత్రాలను గిరివి పెట్టి అదనపు ఋణం ఈటెల కుటుంబం పొందారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని రామారావు ఫిర్యాదు చేశారు.

1992లో దేవరయాంజల్‌ వచ్చి 1994లో అక్కడి భూములు కొన్నామని, దేవుడి భూమి అయితే బ్యాంకులు ఎలా అప్పు ఇచ్చాయని గతంలో ఈటల జమున ప్రశ్నించిన సంగతి తెలిసిందే. 46 ఎకరాల కన్నా ఒక్క ఎకరం భూమి ఎక్కువగా ఉన్నట్టు నిరూపిస్తే ముక్కు నెలకు రాస్తా.. లేకుంటే అధికారులు ముక్కు నేలకు రాస్తారా? అని జమన సవాలు విసిరిన సంగతి తెలిసిందే.

Read More : Delhi : నేటి నుంచే.. లిక్కర్ హోమ్ డెలివరీ, కండిషన్స్ అప్లై!