Lakhimpur Kheri Violence : రైతులపై దూసుకెళ్లిన కారు వీడియో వైరల్‌..సీబీఐ దర్యాప్తు చేయించాలని సీజేఐకి లాయర్ల విజ్ణప్తి

ఉత్తరప్రదేశ్ లోని లఖిమ్‌పూర్‌ ఖేరీ జిల్లాలో ఆదివారం కేంద్రమంత్రి కుమారుడు నడిపిన కారు ఢీకొని రైతులు మరణించడం,ఆ తర్వాత చోటు చేసుకున్న ఘటనలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని

Lakhimpur Kheri Violence :  రైతులపై దూసుకెళ్లిన కారు వీడియో వైరల్‌..సీబీఐ దర్యాప్తు చేయించాలని సీజేఐకి లాయర్ల విజ్ణప్తి

Up (4)

Lakhimpur Kheri Violence ఉత్తరప్రదేశ్ లోని లఖిమ్‌పూర్‌ ఖేరీ జిల్లాలో ఆదివారం కేంద్రమంత్రి కుమారుడు నడిపిన కారు ఢీకొని రైతులు మరణించడం,ఆ తర్వాత చోటు చేసుకున్న ఘటనలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని ఉత్తరప్రదేశ్ లాయర్లు భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ ఎన్వీ రమణని కోరారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో లఖిమ్‌పూర్‌ ఖేరీ హింసాత్మక ఘటనలపై సీబీఐ దర్యాప్తు జరగేలా ఆదేశాలివ్వాలని ఓ పిటిషన్ లో సీజేఐని యూపీ లాయర్లు కోరారు. అదేవిధంగా ఆదివారం నాటి ఘటనలో ఇన్వాల్వ్ అయిన మంత్రులపై ఎఫ్ఐఆర్ నమోదుచేసి,శిక్ష పడేలా చూసేందుకు కేంద్రహోంశాఖకు ఆదేశాలివ్వాలని సీజేఐ ఎన్వీ రమణని కోరారు.

కాగా,ఆదివారం నాటి ఘటనలో మొత్తం 9 మంది మరణించారు. మరణించినవారిలో నలుగురు రైతులు ఉన్నారు. సోమవారం రాష్ట్ర పోలీసులు మరియు రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ మధ్య చర్చల తర్వాత ముగ్గురు రైతుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. అయితే తుపాకీ తూటా తగిలి మరణించినట్లు చెబుతున్న నాలుగో రైతు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించలేదు. ఆ రైతు మృతదేహాన్ని మరోసారి పోస్ట్ మార్టం కోసం పంపే అవకాశముంది. పోస్ట్ మార్టం ఢిల్లీ హాస్పిటల్ లో జరగాలని రైతు నేతలు పట్టుబడుతున్నారు.

ఇక,ఎనిమిది మృతదేహాల పోస్ట్‌మార్టం రిపోర్ట్ లో… గాయాలు, షాక్ మరియు మెదడు రక్తస్రావం కారణంగా మరణాలు సంభవించినట్లు తేలింది.

మరోవైపు, ఆదివారం లఖిమ్‌పూర్‌ ఖేరీ జిల్లాలో నిరసన వ్యక్తం చేస్తోన్న రైతులపైకి ఎస్‌యూవీ కారు దూసుకెళ్లిన దృశ్యాలు తాజాగా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 25 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఓ వాహనం పూర్తిగా రైతుల మీద నుంచి దూసుకెళ్లింది. దీంతో కొందరు రైతులు కిందపడిపోగా.. మరికొంత మంది కారు నుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇంతలో వెనక మరో వాహనం సైరెన్ తో వెళ్లింది. అయితే ఈ వీడియోను పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. అలాగే వీడియోలో మంత్రి కొడుకే కారు నడుతుపుతున్నట్లు స్పష్టంగా కనిపించడం లేదు.

బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ సైతం వీడియోను తన ట్విటర్‌లో షేర్‌ చేయడం గమనార్హం. ఉద్ధేశ్యపూర్వకంగా రైతులను కారుతో తొక్కించిన వీడియో చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుందని, కారులో కూర్చున్న వారితోపాటు ఈ ఘటనకు కారకులైన వారందరిని వెంటనే అరెస్టు చేయాలని సూచించారు.

ALSO READ  కొత్త జమ్మూ కశ్మీర్ గా ఉత్తరప్రదేశ్; 9 మరణాలకు ముందు అసలేం జరిగిందంటే

ALSO READ మోదీకి ప్రియాంక గాంధీ.. లఖిమ్‌పూర్ వీడియో చూపిస్తూ సూటి ప్రశ్న