LIC IPO : ఎల్ఐసీ పాలసీదారులకు ముఖ్యగమనిక

డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఐపీఓకు దరఖాస్తు చేయాలని అనుకొనే వారు...

LIC IPO : ఎల్ఐసీ పాలసీదారులకు ముఖ్యగమనిక

Lic

Life Insurance Corporation : త్వరలోనే ఎల్ఐసీ ఐపీవో (LIC IPO) రాబోతోంది. 2022 మార్చిలోపల ఎల్ఐసీ ఐపీవో తీసుకొచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చే్స్తోంది. ఇందుకు పాలసీ హోల్డర్ లను అప్రమత్తం చేస్తోంది. పాలసీ హోల్డర్లలో అవగాహన పెంచేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎల్ఐసీ ప్రకటించింది. తమ తమ పాన్ నెంబర్లను అప్ డేట్ చేయాల్సిందిగా పాలసీదారులకు కీలక సూచనలు జారీ చేసింది. ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూలో పాల్గొనే వారికి సూచనలు చేసింది. పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదనకు ఈ సంవత్సరం జులైలో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇష్యూకి సబ్ స్ర్కయిబ్ చేయాలంటే…కంపెనీకి సంబంధించిన రికార్డుల్లో పాలసీదారుల పాన్ వివరాలు కంపల్సరీగా ఉండాల్సి ఉంటుందని తెలిపింది.

Read More : DH Srinivas: ఏ క్షణంలోనైనా భారత్‌లోకి ఒమిక్రాన్ రావచ్చు.. తస్మాత్ జాగ్రత్త!

డీ మ్యాట్ ఖాతా తెరవడం..పాన్ జారీ మొదలైన వాటికి ఖర్చు అవుతుందని, ఇదంతా పాలసీదారే భరించాల్సి ఉంటుందని వెల్లడించింది. డీమ్యాట్ ఖాతా లేని వారు…సొంత ఖర్చుతో అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందని ఎల్ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్)..కంపెనీకి సంబంధం లేదని స్పష్టం చేసింది. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఐపీఓకు దరఖాస్తు చేయాలని అనుకొనే వారు…ఎల్ఐసీ దగ్గర వారి పాన్ నెంబర్ అప్‌డేట్ ఉండాల్సి ఉంటుంది. పాలసీ హోల్డర్లు తమ పాన్ నెంబర్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుందని ఎల్ఐసీ వెల్లడిస్తోంది.

Read More : Raghu : లిక్కర్ బిజినెస్‌లోకి జబర్దస్త్ కమెడియన్

అధికారిక వెబ్‌సైట్‌లో పాన్ నెంబర్, పాలసీ నెంబర్, పుట్టిన తేదీ, ఈ-మెయిల్ ఐడీ నమోదు చేయాల్సి ఉంటుందని, ఒకవేళ ఆన్‌లైన్‌లో పాన్ నెంబర్ అప్‌డేట్ చేయలేని వారు…ఏజెంట్‌ను సంప్రదించాలని సూచిస్తోంది. ప్రతిపాదన ప్రకారం…ఇష్యూ పరిమాణంలో 10 శాతం దాక షేర్లను పాలసీదారులకు కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిజిన్వెస్ట్ మెంట్ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే దీనిని పూర్తి చేసే అవకాశాలున్నాయి.