Raghu : లిక్కర్ బిజినెస్‌లోకి జబర్దస్త్ కమెడియన్

తాజాగా ఓ జబర్దస్త్ కమెడియన్ కూడా బిజినెస్ లోకి దిగాడు. అది కూడా లిక్కర్ బిజినెస్ లోకి. సాఫ్ట్ వేర్ ఎంప్లాయి గా ఉండే రఘు 'అదుర్స్' సినిమాలో తన కామెడీతో అందర్నీ......

Raghu : లిక్కర్ బిజినెస్‌లోకి జబర్దస్త్ కమెడియన్

Raghu

Raghu :  సినిమా ప్రపంచంలో ఎవరు ఎప్పుడు సక్సెస్ అవుతారో, ఎవరు ఎప్పుడు కనుమరుగవుతారో ఎవరూ చెప్పలేరు. వెండితెరపై చాలా అందంగా కనిపించినా తెర వెనుక మాత్రం కొంతమంది సినీ నటుల జీవితాలు చాలా సాధారణంగా ఉంటాయి. గతంలో కూడా ఎంతో మంది స్టార్ ఆర్టిస్టులు సైతం అవకాశాలు లేని రోజుల్లో డబ్బులు పోగొట్టుకొని సాధారణ జీవితం గడిపారు. అయితే కొంతమంది మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు వెలుగులో ఉన్నప్పుడే సంపాదించిన డబ్బుతో బిజినెస్ లు చేస్తారు. ఎప్పుడన్నా అవకాశాలు తగ్గితే బిజినెస్ లలో ఫిక్స్ అయిపోతారు. ఇటీవల చాలా మంది నటీనటులు ఇదే ఫాలో అవుతున్నారు.

Akhanda : మా సౌండ్ బాక్సులు బద్ధలవుతున్నాయి.. ‘అఖండ’లో తమన్ వీర కొట్టుడు..

తాజాగా ఓ జబర్దస్త్ కమెడియన్ కూడా బిజినెస్ లోకి దిగాడు. అది కూడా లిక్కర్ బిజినెస్ లోకి. సాఫ్ట్ వేర్ ఎంప్లాయి గా ఉండే రఘు ‘అదుర్స్’ సినిమాలో తన కామెడీతో అందర్నీ మెప్పించి మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకొని సినిమాల్లో తన ప్రయాణం మొదలు పెట్టాడు. తర్వాత చాలా సినిమాల్లో కమెడియన్ గా నటించారు. మధ్యలో జబర్దస్త్ లో రోలర్ రఘు పేరుతో టీం కూడా నడిపించాడు. జబర్దస్త్ తో రఘుకి ఇంకా పేరు వచ్చింది. జబర్దస్త్ నుంచి బయటకి వచ్చిన తర్వాత కేవలం సినిమాల్లోనే నటించాడు. అయితే గత కొద్ది కాలంగా రఘుకి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఇక కరోనాతో రఘు తెరపై కనిపించకుండా పోయాడు.

Bigg Boss : బిగ్‌బాస్ లోకి బన్నీ.. పీక్స్‌లో ‘పుష్ప’ ప్రమోషన్స్

లాక్ డౌన్ లో తన సొంతూరికి వెళ్లిన రఘు ఆర్గానిక్ మొక్కలను నాటి వాటితో కూరగాయల్ని పండించాడు. అవి మంచి ఆదాయం తీసుకురావడంతో మరో పది ఎకరాల పొలం లీజుకు తీసుకొని భారీ స్థాయిలో కూరగాయలు పండించాడు. ఈ బిజినెస్ లో రఘు మంచి లాభాలను సంపాదించాడని సమాచారం. ఇందులో వచ్చిన డబ్బుతో రఘు లిక్కర్ బిజినెస్ ని మొదలు పెట్టాడు.

Puneeth Rajkumar : 22 ఏళ్ళ వివాహ బంధం.. ఇకపై పునీత్ జ్ఞాపకాల్లోనే

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాల వేలంలో రఘుతో పాటు అతని ముగ్గురు స్నేహితులు కలిసి టెండర్స్ వేశారు. అందులో రెండు టెండర్స్ రఘు పేరు మీద వచ్చాయి. దీంతో నల్గొండ పట్టణ శివారులో మర్రిగూడ బైపాస్‌ వద్ద రెండు దుకాణాలను రఘు దక్కించుకున్నాడు. ఇటీవలే ఈ షాపులను ఓపెన్ చేసి మద్యం అమ్మడం మొదలు పెట్టాడు. రఘు స్వయంగా షాప్ లో ఉండి మద్యం అమ్ముతుండటంతో అక్కడికి వచ్చిన వాళ్ళు తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి అవకాశాలు లేకపోయినా లైఫ్ ని బాగా సెట్ చేసుకున్నాడని అనుకుంటున్నారు.