Meteor Shower : ఆకాశంలో వెలుతురు,శబ్ధాలతో…నార్వేలో ఉల్కాపాతం

ఉల్కపాతాన్ని స్వయంగా చూసిన నెట్ వర్క్ కు చెందిన మోర్టెన్ బిల్లిట్ చాలా వేగంగా , రెప్పపాటు సమయంలో ఈ ఉల్కాపాతం చోటు చేసుకున్నట్లు చెప్పారు.

Meteor Shower : ఆకాశంలో వెలుతురు,శబ్ధాలతో…నార్వేలో ఉల్కాపాతం

Meteor Shower

Meteor Shower : ఆకాశంలో అప్పుడప్పుడు వింతలు చోటు చేసుకుంటుంటాయి. వాటిలో ఉల్కాపాతం కూడా ఒకటి.. రాత్రి సమయంలో అకస్మాత్తుగా అకాశం నుండి క్రిందికి జాలువారుతున్నట్లు వెలుతురు కనిపిస్తుంది. అదే ఉల్కాపాతం. ప్రస్తుతం నార్వేలో ఉల్కాపాతం చోటు చేసుకున్న ఉల్కాపాతం చర్చనీయాంశంగా మారింది. నార్వేలోని ఓస్లో పరిసర ప్రాంతాల్లో ఈ ఉల్కాపాతం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

ఈ ఉల్కాపాతానికి సంబంధించిన దృశ్యాలు వెబ్ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు వైరల్ గా మారాయి. ఓస్లో నుండి 60 కిలోమీటర్ల దూరంలో తెల్లవారు జాము సమయంలో అకాశం నుండి పెద్ద శబ్ధాలు, మిరుమిట్లు గొలిపే కాంతితో కూడిన ఉల్కాపాతాన్ని స్ధానికులు చూసినట్లు తెలుస్తుంది. అవే దృశ్యాలు హోల్మ్ స్ట్రాండ్ పట్టణంలో ఏర్పాటు చేసిన వెబ్ కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయి. ఈ దృశ్యాల అధారంగా ఉల్కాపాతం ఎక్కడ జరిగిందన్న దానిపై వీడియో దృశ్యాలను శాస్త్ర వేత్తలు విశ్లేషిస్తున్నారు.

ఉల్కపాతాన్ని స్వయంగా చూసిన నెట్ వర్క్ కు చెందిన మోర్టెన్ బిల్లిట్ చాలా వేగంగా , రెప్పపాటు సమయంలో ఈ ఉల్కాపాతం చోటు చేసుకున్నట్లు చెప్పారు. శిధిలాలను గుర్తించేందుకు చాలా సమయం పడుతుందన్నారు. ఓస్లో నుండి ఫైన్మార్కా అటవీప్రాంతంలో ఉల్కాపాతం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

సౌరమండలంలోని శిధిల పదార్ధాన్నే ఉల్కగా చెప్తారు. ఆపధార్థాలు చిన్న సైజు నుండి పెద్ద సైజు బండరాళ్ళుగా కూడా ఉండవచ్చు. గత రెండు శతాబ్ధాల్లో పదకొండు వందలకు పైగా ఉల్కలు భూమిపై రాలి ఉండవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా. ఈ ఉల్కలు గంటకు 2,15,000 కిలోమీటర్ల వేగంతో భూ వాతారవణంలోకి చేరతాయి. చుక్కల్లా క్రిందికి రాలిపోతున్నట్లు కనిపిస్తుంటాయి. వీటి వల్ల ఎలాంటి హాని ఉండనప్పటికీ, 2013లో రష్యాలో చోటు చేసుకున్న ఉల్కా పాతంలో పెద్ద సంఖ్యలో గాయపడటంతోపాటు, భవనాలు ద్వంసం అయ్యాయి.