Warangal : పోలీసు అధికారులకు అమ్మాయిలను ఎరగా వేసి..వరంగల్‌లో లిక్కర్ డాన్

వరంగల్‌లో లిక్కర్‌ మాఫియా రెచ్చిపోతోంది. అక్రమ సంపాదనే టార్గెట్‌గా అక్రమాలకు పాల్పడుతోంది. వాళ్లను, వీళ్లను కాదు... తమ దందా కోసం ఏకంగా పోలీసులనే ట్రాప్‌ చేశారు.

Warangal : పోలీసు అధికారులకు అమ్మాయిలను ఎరగా వేసి..వరంగల్‌లో లిక్కర్ డాన్

Warangal

Liquor Don : వరంగల్‌లో లిక్కర్‌ మాఫియా రెచ్చిపోతోంది. అక్రమ సంపాదనే టార్గెట్‌గా అక్రమాలకు పాల్పడుతోంది. వాళ్లను, వీళ్లను కాదు… తమ దందా కోసం ఏకంగా పోలీసులనే ట్రాప్‌ చేశారు. అమ్మాయిలను ఎరవేసి సీఐలను ట్రాప్‌ చేశారు. పోలీసులకు అందిన రహస్య కంప్లైంట్‌తో లిక్కర్‌ మాఫియా అక్రమాలపై కూపీ లాగుతున్నారు పోలీసులు.ఈ మధ్యే పోలీసులకు గ్రేటర్ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్తపై రహస్య కంప్లైంట్‌ అందింది. తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషే స్వయంగా రంగంలోకి దిగినట్లు సమాచారం.

Read More : Happy Birthday : హ్యాపీ బర్త్ డే గూగుల్‌..23 డూడుల్

లిక్కర్‌ డాన్‌ను, ప్రజాప్రతినిధి భర్తను అదుపులోకి తీసుకున్నారు. వీరిని రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇద్దరూ కలిసి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. లిక్కర్‌ మాఫియా డొంక కదులుతోంది.తన దందా కోసం లిక్కర్‌ డాన్‌ ఏకంగా సీఐలనే ట్రాప్‌ చేసినట్టు, అమ్మాయిలను ఎరవేసి తన దందాకు అడ్డుపడకుండా చూసినట్టు తెలుస్తోంది. అమ్మాయిలతో కలిసి పోలీసులకు విదేశీ టూర్ల అరెంజ్‌ చేసినట్టుగా విచారణలో వెలుగు చూసినట్టు సమాచారం.

Read More : Priya Prakash Varrier: రెయిన్ సాంగ్‌పై మనసుపడ్డ కన్నుగీటు భామ

మగువ, మందు, విందుతో పోలీసులు విదేశాల్లో ఎంజాయ్‌ చేసినట్టుగా సమాచారం. మరికొంత మంది అధికారులు, పొలిటికల్‌ లీడర్లు, వీఐపీలకు లిక్కర్‌ డాన్‌ ఏకంగా తన ఇంట్లోనే పార్టీలు ఏర్పాటు చేసినట్టుగా సమాచారం, దీనికి సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. కోటి రూపాయల వరకు లిక్కర్‌ డాన్‌ అక్రమంగా వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన కీలక నేతలతో లిక్కర్‌ డాన్‌కు సంబంధాలు ఉన్నట్టు టాక్. లిక్కర్‌డాన్‌, ప్రజాప్రతినిధి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న సమాచారంతో ఖద్దరు చొక్కాలు రంగంలోకి దిగినట్లు,. విచారణ చేస్తున్న పోలీసులపై ఒత్తిడి పెంచినట్టు సమాచారం. రాజీ కోసం పలువురు రాయబారం నడుపున్నట్టుగానూ తెలుస్తోంది.