Happy Birthday : హ్యాపీ బర్త్ డే గూగుల్‌..23 డూడుల్

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్...తన పుట్టిన రోజును జరుపుకొంటోంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా డూడుల్ ఏర్పాటు చేసింది. 23ను ప్రత్యేకంగా కనిపించేలా డిజైన్ చేసింది.

Happy Birthday : హ్యాపీ బర్త్ డే గూగుల్‌..23 డూడుల్

Google

Google 23 Doodle : సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్…తన పుట్టిన రోజును జరుపుకొంటోంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా డూడుల్ ఏర్పాటు చేసింది. 23ను ప్రత్యేకంగా కనిపించేలా డిజైన్ చేసింది. ఐస్ క్రీమ్స్, కేక్స్, క్యాండిల్స్ తో డూడుల్ కొత్తగా కనిపిస్తోంది. ఎల్ (L) అక్షరం స్థానంలో క్యాండిల్ ఉంచి..వేడుకల ఫ్లేవర్ ను తెచ్చింది. నెవడాలోని బ్లాక్ రాక్ సిటీలో జరిగిన బర్నింగ్ మ్యాన్ ఈవెంట్ థీమ్ తో తొలిసారి 1998లో గూగుల్ డూడుల్ ని రూపొందించింది.

Read More : Reserve Bank : ఏటీఎం వద్ద ఓ మనిషి ఎంతసేపు ఓపికగా ఉండగలడు ?..సంచలన విషయాలు

అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల డూడుల్స్ ను రూపొందించింది గూగుల్. 1998లో గూగుల్ ప్రారంభించింది. తొలి ఏడేళ్ల తర్వాత..రికార్డ స్థాయిలో పేజ్ వ్యూస్ రావడంతో 2005లో గూగుల్ యానివర్సరీ డేట్ ను సెప్టెంబ్ 04 నుంచి సెప్టెంబర్ 27వ తేదీకి మార్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ తేదీని గూగుల్ పుట్టిన రోజుగా జరుపుతున్నారు.

Read More : Modi : కొత్త పార్లమెంటు భవన నిర్మాణ ప్రదేశాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు సెర్జే బ్రిన్, లారీపేజ్ లో ఓ చిన్న స్టార్టప్ గా 1998లో ప్రారంభించారు. 1998 సెప్టెంబర్ 04వ తేదీన గూగుల్ సెర్చ్ ఇంజిన్ అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్ ఫోన్ లో సాప్ట్ వేర్ అప్ డేట్స్ అన్నీ..జింజర్ బ్రెడ్, ఓరియా, శాండ్ విచ్, కిట్ కాట్, ఐస్ క్రీం, లాలిపాప్, మార్ష్ మాలో ..ఇలా ఐస్ క్రీంల పేర్లతో ఉంటాయి. అందుకనుగుణంగానే..23వ పుట్టిన రోజు సందర్భంగా..పెద్ద పీట వేస్తూ…కేక్ ను డూడుల్ లో పెట్టింది.