మీ టీవీ రిమోట్ పోయిందా? మీ స్మార్ట్‌టీవీని టీవీ రిమోట్‌గా ఇలా మార్చేయొచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

TV Remote Smartphone : మీ టీవీ రిమోట్ పొగొట్టుకున్నారా? ఇకపై టీవీ రిమోట్ విషయంలో చింతించాల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్‌ఫోన్‌‌ను ఏకంగా టీవీ రిమోట్‌గా మార్చేయొచ్చు.

మీ టీవీ రిమోట్ పోయిందా? మీ స్మార్ట్‌టీవీని టీవీ రిమోట్‌గా ఇలా మార్చేయొచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

Lost your TV remote Turn your smartphone into a TV remote with these easy steps

Updated On : September 14, 2024 / 3:20 PM IST

Tech Tips in Telugu : మీ టీవీ రిమోట్‌ను పోగొట్టుకున్నారా? చాలా మంది ఇలాంటి పరిస్థితిని చాలాసార్లు అనుభవించే ఉంటారు. మన టీవీలను కంట్రోల్ చేయడానికి రిమోట్‌ను కనుగొనడంతో పాటు ఉపయోగించడం కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది. మీ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు మీ టీవీ రిమోట్‌కి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.

Google TV యాప్ సాయంతో మీ స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగించి మీ ఆండ్రాయిడ్ ఆధారిత టీవీని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఈ కస్టమైజడ్ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది. టీవీ రిమోట్‌ల కోసం సెర్చ్ చేసి అలసిపోయిన వారికి ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. గూగుల్ టీవీ యాప్‌ సెటప్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also : Netflix Support iPhones : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అలర్ట్.. ఇకపై ఈ ఐఫోన్లు, ఐప్యాడ్‌లలో నెట్‌ఫ్లిక్స్ పనిచేయదు..!

* గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లండి.
* గూగుల్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.
* మీ టీవీ, ఫోన్ ఒకే Wi-Fi నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయి ఉండాలి. మీ టీవీ సపోర్టు చేస్తే బ్లూటూత్‌ని కూడా ఉపయోగించవచ్చు.
* Google TV యాప్‌ను ఓపెన్ చేసి.. స్క్రీన్ కింది రైట్ కార్నర్‌లో ఉన్న రిమోట్ బటన్‌పై నొక్కండి.
* యాప్ అందుబాటులో ఉన్న డివైజ్‌ల కోసం స్కాన్ చేస్తుంది.
* మీ టీవీని గుర్తించిన తర్వాత లిస్టు నుంచి ఎంచుకోండి.
* మీ టీవీ స్క్రీన్‌పై ఒక స్పెషల్ కోడ్ కనిపిస్తుంది.
* మీ ఫోన్‌ను టీవీతో పెయిర్ చేయడానికి యాప్‌ ఓపెన్ చేయాలి.
* ఒకసారి పెయిర్ చేసిన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్ పూర్తిగా పనిచేసే టీవీ రిమోట్‌గా మారుతుంది.
* మీ ఐఫోన్ TVని ఒకే Wi-Fi నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయండి.
* యాప్ స్టోర్‌కి వెళ్లి గూగుల్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి.

మీ ఐఫోన్‌లో యాప్‌ని ఓపెన్ చేసి స్క్రీన్‌కు దిగువన కుడివైపు మూలన ఉన్న టీవీ రిమోట్ ఐకాన్‌పై నొక్కండి. యాప్ ఆటోమేటిక్‌గా మీ టీవీ కోసం సెర్చ్ చేస్తుంది. మీ టీవీని గుర్తించలేకపోతే.. మీరు డివైజ్‌ల కోసం స్కాన్ బటన్‌ను Tap చేయడం ద్వారా మాన్యువల్ స్కాన్‌ చేయొచ్చు.మీ టీవీని గుర్తించిన తర్వాత.. ఆప్షన్ల నుంచి దాన్ని ఎంచుకుని, మీ టీవీ స్క్రీన్‌పై కనిపించే 6-అంకెల కోడ్‌ను ఎంటర్ చేయండి. ఇప్పుడు Pair బటన్ నొక్కండి. మీ ఐఫోన్ సక్సెస్‌ఫుల్ మీ టీవీకి కనెక్ట్ అవుతుంది. ఇది రిమోట్ కంట్రోల్‌గా పనిచేస్తుంది.

Google TV యాప్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను మీ టీవీకి లింక్ చేసిన తర్వాత సాధారణ రిమోట్ కంట్రోల్‌తో మాదిరిగానే వివిధ పనులను చేయవచ్చు. మీ టీవీ ఛానెల్‌లను మార్చుకోవచ్చు. వాల్యూమ్‌ను ఎడ్జెస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన యాప్‌లను ఓపెన్ చేయొచ్చు. మీ ఫోన్ నుంచి నేరుగా మీ టీవీని పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు.

Read Also : iPhone 16 Pre-order Sale : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 16 ప్రీ-ఆర్డర్ సేల్.. ఆఫర్లు, డీల్స్ మీకోసం..!