Love Today : బాలీవుడ్‌కి వెళుతున్న లవ్ టుడే.. ఈ రీమేక్ అయినా హిట్ అవుతుందా?

గత ఏడాది చివరిలో ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని నమోదు చేసుకున్న మూవీ 'లవ్ టుడే'. కాగా ఈ సినిమాని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్..

Love Today : బాలీవుడ్‌కి వెళుతున్న లవ్ టుడే.. ఈ రీమేక్ అయినా హిట్ అవుతుందా?

Love Today

Love Today : గత ఏడాది చివరిలో ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని నమోదు చేసుకున్న మూవీ ‘లవ్ టుడే’. రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రాన్ని ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో తెరక్కించాడు. ఇవానా హీరోయిన్ గా నటించగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. లవర్స్ ఫోన్ మార్చుకోవడం అనే కాన్సెప్ట్ వచ్చిన ఈ మూవీ.. భాషతో సంబంధం లేకుండా అందర్నీ అలరించింది. ఈ నేపథ్యంలోనే తెలుగులో కూడా భారీ విజయం అందుకుంది.

Love Today : కోట్లు కురిపించిన చిన్న సినిమా.. 100 రోజుల లవ్ టుడే..

ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా కేవలం రూ.5 కోట్లతో తెరకెక్కి.. బాక్స్ ఆఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. కాగా ఈ సినిమాని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ‘ఫాంటమ్ స్టూడియోస్’ తో కలిసి ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ విషయాన్ని ఫాంటమ్ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించారు.

మరి హిందీలో ఈ సినిమాని ప్రదీప్ రంగనాథన్ డైరెక్ట్ చేయబోతున్నాడా? లేదా? అనేది తెలియదు. అలాగే మూవీలో నటించే నటీనటులు వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే ఇటీవల.. సౌత్ లో సూపర్ హిట్ అయినా మూవీస్ అన్నిటిని బాలీవుడ్ లో రీమేక్ చేయగా అక్కడ విఫలం అవుతున్నాయి. విక్రమ్ వేద, జిగర్తాండ, జెర్సీ, అలవైకుంఠపురంలో, హెలెన్.. ఇలా వరుస పెట్టి అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇప్పుడు ఈ సినిమా అయినా హిట్ అవుతుందా? లేదా? అనేది చూడాలి.