రూ. 25 పెరిగిన గ్యాస్ ధర.. నాలుగు రోజుల్లో రెండోసారి!

రూ. 25 పెరిగిన గ్యాస్ ధర.. నాలుగు రోజుల్లో రెండోసారి!

సామాన్యులకు మరో పెద్ద దెబ్బగా, ఎల్‌పిజి సిలిండర్ ధరలను సోమవారం(1 మార్చి 2021) మళ్లీ రూ .25 పెంచారు. కేవలం నాలుగురోజుల వ్యవధిలో గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం ఇది రెండవసారి. 14.2 కిలోల గృహ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ .819 కు చేరుకుంది. మార్చి 1 నుంచి కొత్త ధరలను అమలు కానున్నాయి. ఫిబ్రవరి 25న, వంట గ్యాస్ ధరలు పెంచగా.. అంతకుముందు ఫిబ్రవరి 4వ తేదీన మరియు ఫిబ్రవరి 14 న ధరలను పెంచారు.

డిసెంబర్‌లో ఎల్‌పిజి సిలిండర్ ధరను రెండుసార్లు పెంచారు. డిసెంబర్ 1 న దాని రేటును రూ .594 నుండి రూ .644 కు, తరువాత డిసెంబర్ 15 న దాని ధరను మళ్లీ రూ .664 కు పెంచారు. అంటే, నెలలోపు 100 రూపాయలు పెంచారు. అయితే, జనవరిలో ధరలు పెంచలేదు. జనవరిలో సబ్సిడీ లేని ఎల్‌పిజి (14.2 కెజి) ధర రూ .694గా ఉంది.

గ్యాస్ ధరలు ఒక నెల వ్యవధిలోనే దాదాపు రూ. 225వరకు పెరగగా సామాన్యులపై తీవ్రభారం పడనుంది. నెలకు రెండు లేదా మూడుసార్లు ధరలను పెంచేస్తూ సామాన్యుల నెత్తిన పిడుగులా గ్యాస్ బండను వేస్తుండగా.. ప్రభుత్వాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు సామాన్యులు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతుండగా పట్టించుకోని ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశీయ వంట గ్యాస్ ధర రూ.25 పెరిగి ప్రస్తుతం రూ.826కి చేరుకోగా.. నిజానికి ధర పెరగక ముందు ఇది రూ.801 ఉండేది.

అంతకుముందు రూ.776 ఉండే గ్యాస్ ధరలు.. రూ.801కి చేరగా.. ఇప్పుడు ఏకంగా రూ.826కి వెళ్లింది. గడిచిన 29 రోజుల్లో గ్యాస్ ధరలు పెరగడం ఇది ఐదోసారి. మరోవైపు కర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కూడా బారీగానే పెరుగుతోంది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే సిలిండర్‌పై రూ.95 వడ్డించాయి కంపెనీలు. దీంతో కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.1614కు చేరుకోగా.. పెంచిన ధర తక్షణమే అమల్లోకి వస్తుందని పెట్రో కంపెనీలు ప్రకటించాయి.