12 రోజులు..4 వేల కిలోమీటర్లు..సైక్లింగ్ రేసులో న్యూ రికార్డ్ క్రియేట్ చేసిన లెఫ్టినెంట్ కల్నల్

  • Published By: madhu ,Published On : July 3, 2020 / 07:31 AM IST
12 రోజులు..4 వేల కిలోమీటర్లు..సైక్లింగ్ రేసులో న్యూ రికార్డ్ క్రియేట్ చేసిన లెఫ్టినెంట్ కల్నల్

భారత సైనిక అధికారి లెఫ్ట్ నెంట్ కల్నల్ భరత్ పన్ను అరుదైన ఘనత సాధించారు. 12 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల సైకిల్ రేసును పూర్తి చేశాడు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన రేసుల్లో Virtual Race Across America (రేస్ అక్రాస్ అమెరికా (రామ్) RAAM ఒకటి. ఈ రోడ్ సైక్లింగ్ రేసును వర్చువల్ గా నిర్వహించారు. మొత్తం 22 మంది పోటీ పడగా.. పన్ను మూడో స్థానంలో నిలిచారు.

ఇందులో పాల్గొన్న వారంతా..ఇండోర్ నుంచే పోటీలో పాల్గొనడం విశేషం. పన్ను పూణే నుంచి రేసులో పాల్గొన్నాడు. 4 వేల కిలోమీటర్లు తొక్కిన పన్ను 12 రోజుల తర్వాత..ఆదివారం సాయంత్రం రేసు పూర్తి చేశాడు. మొత్తం 11 నిద్ర విరామాలు (90 నుంచి 180 నిమిషాలు మాత్రమే) తీసుకున్నాడు. 24 గంటల పాటు అతడి కదలికలను గమనించడానికి…సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

నిర్ణీత సమయంలో రేసును పూర్తి చేయడానికి చాలా కష్టపడ్డారు. సీటు పై నుంచి లేచి శరీరాన్ని కదపొచ్చి..అది..బయట..కానీ..ఇండోర్ లో సాధ్యం కాదని పన్ను వెల్లడించారు. సైకిల్ ఫ్రేమ్ ఓ స్టాండ్ కు బిగించి ఉంటుందన్నారు. రేసు ఆరంభంలో పన్ను 38 గంటల పాటు సైక్లింగ్ చేసిన తర్వాత తొలి నిద్ర విరామం (90 నిమిషాలు) తీసుకున్నాడు.

మరోవైపు..చైనా సైనికులు జరిపిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమరులైన సంగతి రేస్ పూర్తయ్యాక పన్నుకు తెలిసింది.

Read:జూన్‌లో UPI పేమెంట్స్ ఆల్ టైమ్ రికార్డు.. ఎంతో తెలుసా?