లాక్ డౌన్ ఎఫెక్ట్, యూకేలో 400శాతం పెరిగిన వయాగ్రా అమ్మకాలు, బెడ్ రూమ్ లో కుమ్మేస్తున్నారు

లాక్ డౌన్ వేళ బెడ్ రూమ్ ను స్పైసీగా మార్చేసి పార్టనర్ తో రొమాన్స్

  • Published By: naveen ,Published On : May 11, 2020 / 12:14 PM IST
లాక్ డౌన్ ఎఫెక్ట్, యూకేలో 400శాతం పెరిగిన వయాగ్రా అమ్మకాలు, బెడ్ రూమ్ లో కుమ్మేస్తున్నారు

లాక్ డౌన్ వేళ బెడ్ రూమ్ ను స్పైసీగా మార్చేసి పార్టనర్ తో రొమాన్స్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఉంది. ఆ దేశం ఈ దేశం అని కాదు యావత్ ప్రపంచం కరోనా దెబ్బకు వణుకుతోంది. ఇప్పటివరకు ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టలేదు. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ అస్త్రాన్ని సంధించాయి. చాలా దేశాల్లో ఎంతో స్ట్రిక్ట్ గా లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ప్రజలను ఇళ్లకే పరిమితం చేశాయి. కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు ఇచ్చాయి.

బెడ్ రూమ్ ను స్పైసీగా మార్చేసి పార్టనర్ తో రొమాన్స్:
లాక్ డౌన్ వేళ వేరే దేశాల ప్రజలు ఏం చేస్తున్నారో తెలియదు కానీ, యూకేలో మాత్రం కపుల్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారట. ఇంట్లో ఎక్కువ సేపు ఉండే సమయం దొరకడంతో దంపతులు పండగ చేసుకుంటున్నారట. ఎక్కువసేపు బెడ్ రూమ్ లో రొమాన్స్ లో గడిపేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. లాక్ డౌన్ పీరియడ్ లో యూకేలో వయాగ్రా సేల్స్ విపరీతంగా పెరిగాయట. ఏకంగా 400శాతం ఎక్కువగా అమ్మకాలు జరిగాయని తెలిసింది. లాక్ డౌన్ తో బోరింగ్ ఫీల్ అవుతున్న యూకే ప్రజలు తమ పడక గదులను స్పైసీగా మార్చుకుంటున్నారు. వయాగ్రా వేసుకుని రొమాన్స్ లో పార్టనర్ తో రెచ్చిపోతున్నారట. 2019తో మార్చి నెలతో పోలిస్తే 2020 మార్చి నెలలో యూకేలో వయాగ్రా సేల్స్ విపరీతంగా పెరిగాయి.

* వయాగ్రా బిళ్లల అమ్మకాలతో పాటు ఆఫ్టర్ పిల్, అకాల స్ఖలనం ట్యాబెట్ల అమ్మకాలు కూడా 34శాతం పెరిగాయి.
* ఆన్‌లైన్ ఫార్మసీ యుకె మెడ్స్ గత నెలలో ఏకంగా 4వేల అంగస్తంభన చికిత్స ప్యాకెట్లను విక్రయించింది.
* 17% జంటలు తమ లాక్‌డౌన్ సమయాన్ని ఎక్కువ సెక్స్‌లో గడుపుతున్నారని ఓ పోల్ లో తేలింది.
* Ipsos Mori జరిపిన పరిశోధనలో 18-34 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ఎక్కువగా బెడ్ రూమ్ లో స్పెండ్ చేస్తున్నారని తేలింది.

ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. కచ్చితంగా అందరూ ఇంట్లోనే ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఎక్కువ సేపు ఇంట్లో ఉండే సమయం దొరికింది. అందుకే ఈ సమయాన్ని వృథా చేయదల్చుకోలేదు. బెడ్ రూమ్ ని స్పైసీగా మార్చుకున్నాం. పార్టనర్ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాం అని స్థానికులు చెబుతున్నారు.

Read Here>> ఇదో కొత్త కోణం.. సెక్స్‌తో పెరుగుతున్న కరోనా కేసులు