ఇదో కొత్త కోణం.. సెక్స్‌తో పెరుగుతున్న కరోనా కేసులు

  • Published By: Subhan ,Published On : May 9, 2020 / 04:57 AM IST
ఇదో కొత్త కోణం.. సెక్స్‌తో పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా వైరస్ వ్యాప్తి సెక్స్ కారణంగా మరింత పెరుగుతుందని కొత్త స్టడీ చెప్తుంది. అనుమానంతో జరిపిన పరిశోధనలకు సమాధానం దొరికింది. చైనాలో Covid-19తో బాధపడి కోలుకున్న వ్యక్తుల సీమెన్ లో వైరస్ ఉన్నట్లు గుర్తించారు. చైనాలోని షాంగ్‌క్యూ మునిసిపల్ హాస్పిటల్ 38మంది మగవారి స్పెర్మ్ పై స్టడీ చేసింది. కొందరి సీమెన్లో వైరస్ సజీవంగానే ఉన్నట్లు గుర్తించింది. 

ఈ స్టడీ శాంపుల్ గా చేసింది మాత్రమేనని.. దీనిపై ఇంకా పనిచేయాల్సి ఉందని.. కరోనా వైరస్ సెక్స్ చేయడం వల్ల వ్యాప్తి జరుగుతుందా.. గతంలో ఏమైనా లక్షణాలు ఉన్నాయా అనే దానిపై స్టడీ చేస్తున్నారు. ఇన్ని రోజులు తుమ్ములు, దగ్గులు, ఉమ్ము ద్వారా విడుదలయ్యే నీటి తుంపర్ల కారణంగా కరోనా వ్యాప్తి జరుగుతుందని భావించాం. ఈ కొత్త స్టడీతో సెక్స్ తో కూడా కరోనా వ్యాప్తి కన్ఫామ్ అని తెలిస్తే ఇక జాగ్రత్తలు ఏ మేర తీసుకోవాలో..

జనరల్ మెడికల్ జర్నల్ జామా నెట్‌వర్క్.. SARS-CoV-2 పేషెంట్ల సీమెన్లలో సజీవంగానే ఉంటుంది.. రికవరీ అయిన వారిలోనూ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. ఓ 50మంది పేషెంట్లపై స్టడీ నిర్వహించాలని భావిస్తే వారిలో 12మంది సీమెన్ ఇచ్చే పరిస్థితిలో లేరు. పర్సనల్ రీజన్స్ వల్ల వారు ఇవ్వలేకపోవడంతో 38పైనే స్టడీ నిర్వహించారు. 

వారిలో 23 మంది పార్టిసిపెంట్స్ పూర్తిగా కోలుకున్నారు. 15మంది కోలుకునే దశకు చేరుకున్నారు. వారందరిలో ఆరుగురి సీమెన్లో SARS-COV2 సజీవంగా ఉంది. కోలుకునే దశలో ఉన్నవారి సీమెన్లో 15మందిలో నలుగురిలో వైరస్ ఇన్ఫెక్షన్ ఉంది. పూర్తిగా రికవరీ అయిన 23మంది పేషెంట్లలో ఇద్దరి సీమెన్ లోనూ SARS-COV2 కనిపించింది. 

దీనిని బట్టి సెలైవా, రక్తంతో పాటు సీమెన్ తోనూ కరోనా సోకే అవకాశాలు ఉన్నట్లు స్పష్టమైంది. కరోనా వైరస్ పేషెంట్ తోనే కాకుండా రికవరీ అయిన పేషెంట్లలోనూ కనిపిస్తుండటంతో సెక్స్ చేసే ముందు కాస్త ముందు వెనుక ఆలోచించుకోవాలి. రికవరీ అయినా దూరం పాటించడం తప్పదేమో..

Also Read | ప్రియుడితో కలిసి భర్తను కాటికి పంపించిన భార్య..కరోనా మరణంగా చిత్రీకరించాలని అనుకుని