Maa Elections 2021 : హేమకు స్వీట్ వార్నింగ్..
హేమ, ప్రస్తుత ‘మా’ ప్రెసిడెంట్ సీనియర్ నరేష్ గురించి చేసిన వ్యాఖ్యలు ‘మా’ లో వాతావరణం వేడెక్కెలా చేశాయి..

Hema
Maa Elections 2021: ఈ ఏడాది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎలక్షన్స్ మాంచి రసవత్తరంగా మారబోతున్నాయి. ఎప్పుడూ ఇద్దరు మాత్రమే నిలిబడే అధ్యక్ష బరిలో ఈ సారి ఏకంగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత రాజశేఖర్, సీవీఎల్ నరసింహ రావు వంటి ఐదుగురు సభ్యులు పోటీపడుతున్నారు.. ‘తెగే దాకా లాగొద్దు.. జెండా ఎగరేస్తాం’ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్స్ చెయ్యడం సంచలనంగా మారింది.
Maa Elections: తెగేదాకా లాక్కండి.. ఎన్నికలపై ప్రకాష్ రాజ్!
రోజుకో మలుపు తీసుకుంటున్న ‘మా’ ఎన్నికల నిర్వహణ గురించి సభ్యులంతా కలిసి సీనియర్ నటుడు కృష్ణంరాజుని కలిసి తమ వెర్షన్ వినిపించారు. ఈ నేపథ్యంలో హేమ, ప్రస్తుత ‘మా’ ప్రెసిడెంట్ సీనియర్ నరేష్ గురించి చేసిన వ్యాఖ్యలు ‘మా’ లో వాతావరణం వేడెక్కెలా చేశాయి. దీంతో హేమకు ‘మా’ క్రమ శిక్షణ సంఘం వివరణ ఇవ్వాల్సిందిగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Prakash Raj : ‘మా’లో కాక రేపుతున్న ప్రకాశ్‌రాజ్ ట్వీట్
ఇక హేమపై వేటు తప్పదు అని అంతా అనుకుంటుండగా.. క్రమ శిక్షణ సంఘం ఆమెకు ఊరటనిచ్చినట్లు తెలుస్తోంది. దీన్ని మొదటి తప్పిదంగా భావించి, హేమను హెచ్చరిస్తూ ఆమె మీద ఎలాంటి క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఫిలిం వర్గాల వారి సమాచారం. డీఆర్‌సీ కోరినట్లు హేమ వివరణ ఇవ్వడంతో.. ఇంకోసారి రిపీట్ అయితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారట.
Mega Star Chiru: మా ఎన్నికల గురించి మెగాస్టార్ లేఖ.. జరగాల్సిందే
కాగా నరేష్ ఫండ్ రైజింగ్ చేసిన డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యడమే కాక సభ్యులందరికీ వాయిస్ మెసేజెస్ పంపి రచ్చ రచ్చ చేసింది. ‘మా’ ఎన్నికలు వెంటనే జరపాలని, ఆలస్యమైతే కనుక సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని, దీంతో సినీ కార్మికులు ఇబ్బంది పడతారని మెగాస్టార్ చిరంజీవి ‘మా’ సభ్యులకు హెచ్చరిక జారీ చేశారు.
MAA Elections: సెప్టెంబర్ 12న ‘మా’ ఎన్నికలు.. ముగిసిన జనరల్ బాడీ మీటింగ్!