MAA Elections : ‘మా’ ఎన్నికల కోసం జోరుగా నైట్‌ పార్టీలు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల తేదీపై.. అధికారికంగా ప్రకటన రావడంతో.. తెరవెనుక డ్రామాలు మొదలయ్యాయి. 956 మంది సభ్యులున్న సంఘానికి అధ్యక్ష బరిలో ఏకంగా ఐదుగురు నిలబడ్డారు.

MAA Elections : ‘మా’ ఎన్నికల కోసం జోరుగా నైట్‌ పార్టీలు

Maa

movie artists association : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల తేదీపై.. అధికారికంగా ప్రకటన రావడంతో.. తెరవెనుక డ్రామాలు మొదలయ్యాయి. 956 మంది సభ్యులున్న సంఘానికి అధ్యక్ష బరిలో ఏకంగా ఐదుగురు నిలబడ్డారు. ఓట్లు తమకే పడేలా.. ఎవరి పని వారు చేసుకుపోతున్నారు. మా ఎన్నికల కోసం జోరుగా నైట్ పార్టీలు చేసేస్తున్నారు. ఇవాళ సాయంత్రం పార్టీకి రావాలంటూ.. సభ్యులకు మా అధ్యక్షుడు నరేష్ నుంచి ఆహ్వానం అందినట్లు.. ప్రస్తుత మా అధ్యక్షుడు నరేశ్‌ పేరు మీద ఓ మెసేజ్‌ గ్రూప్స్‌లో సర్క్యులేట్ అవుతోంది.

శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి మీ సమయాన్ని బ్లాక్ చేయండంటూ.. అందులో మెసేజ్‌ ఉంది. దానికి సంబంధించి.. దశపల్ల ఫోరమ్ హాల్‌లో మీట్ అండ్ గ్రీట్ కోసం మా నుంచి మీకు ఆహ్వానం అందుతుందంటూ మెసేజ్‌ సారాంశం. అయితే.. ఈ మద్య ఫిల్మ్‌నగర్‌లో పార్టీలు జోరుగా జరుగుతున్నాయి. మొన్న కింగ్‌ నాగార్జున బర్త్ డే సెలబ్రేషన్స్ అంటూ మా సభ్యులకు సమీర్ ఆహ్వానం అందింది. ఇవాళ ఏమో ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ ఆహ్వానం అందినట్లు మెసేజ్‌ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది.

ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్ నరసింహారావు మా ఎలక్షన్లలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఐదుగురు పోటీలో ఉన్నా.. ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు ప్యానెల్స్ మధ్యే ప్రధానంగా పోరు సాగనుంది. మెగా ఫ్యామిలీ అండదండలతో ప్రకాశ్‌ రాజ్.. కృష్ణంరాజు, కృష్ణ, బాలకృష్ణ లాంటి సీనియర్ నటులు మంచు విష్ణుకు అండగా ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. జీవిత, హేమ మహిళా కార్డుతో పోటీకి సై అంటున్నారు.

ఇక సీనియర్‌ ఆర్టిస్టు సీవీఎల్‌ నరసింహారావు తెలంగాణ వాదంతో పోటీలో నిలబడ్డారు. ప్రస్తుత ఎన్నికల్లో మంచు మనోజ్‌కు నరేశ్‌ వర్గం సపోర్ట్‌ ఇస్తోంది. మా సభ్యులను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు నరేశ్‌ పార్టీ ఇస్తాడంటూ చక్కర్లు కొడుతున్న మెసేజ్‌ కూడా.. సినిమా పాలిటిక్స్‌లో భాగమననే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది.