Vedaant Madhavan : మరోసారి స్విమ్మింగ్ లో పతకాలు కొల్లగొట్టిన మాధవన్ తనయుడు..

తాజాగా మరోసారి వేదాంత పేరు మారుమ్రోగుతుంది. ఇటీవల జరిగిన ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ 2023 లో మాధవన్ తనయుడు వేదాంత్ స్విమ్మింగ్ లో పలు విభాగాల్లో పాల్గొన్నాడు. ఈ గేమ్స్ లో వేదాంత్ ఏకంగా 7 పతాకాలు అందుకున్నాడు. ఇందులో...................

Vedaant Madhavan : మరోసారి స్విమ్మింగ్ లో పతకాలు కొల్లగొట్టిన మాధవన్ తనయుడు..

Madhavan son Vedaant Madhavan wins 5 gold and 2 silver medals in Khelo India Youth Games 2023

Vedaant Madhavan :  తమిళ్, తెలుగు, హిందీ సినిమాలతో ఎంతగానో ప్రేక్షకులని మెప్పించిన నటుడు మాధవన్. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన మాధవన్ ప్రస్తుతం చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నాడు. మాధవన్ తో పాటు మాధవన్ తనయుడు కూడా ఇటీవల సెలబ్రిటీ అయ్యాడు. చాలా మంది సినీ పరిశ్రమలోని స్టార్ల పిల్లలు సినీ పరిశ్రమలోకి వస్తారు. కొంతమంది మాత్రమే వేరే రంగాలని ఎంచుకుంటారు. మాధవన్ తనయుడు వేదాంత్ కూడా స్పోర్ట్స్ లో స్విమ్మింగ్ రంగాన్ని ఎంచుకున్నాడు.

వేదాంత్ చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటూ పతకాలు గెలుస్తున్నాడు. గతేడాది కొన్ని జాతీయ, అంతర్జాతీయ పతకాలు గెలవడంతో ఒక్కసారిగా స్టార్ అయ్యాడు వేదాంత్. చిన్న వయసులోనే వేదాంత్ స్విమ్మింగ్ లో పతకాలు సాధిస్తుండటంతో అంతా వేదాంత్ ని అభినందిస్తున్నారు. మాధవన్ కూడా తన తనయుడు మరింత వృద్ధిలోకి రావాలని, స్విమ్మింగ్ లో ఇంటర్నేషనల్ పతకాలు ఇంకా సాధించాలని దుబాయ్ కి షిఫ్ట్ అయి మరీ అక్కడ తన తనయుడికి స్పెషల్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు.

Nayanathara : అందరి ముందు షారుఖ్ కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరోయిన్..

తాజాగా మరోసారి వేదాంత పేరు మారుమ్రోగుతుంది. ఇటీవల జరిగిన ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ 2023 లో మాధవన్ తనయుడు వేదాంత్ స్విమ్మింగ్ లో పలు విభాగాల్లో పాల్గొన్నాడు. ఈ గేమ్స్ లో వేదాంత్ ఏకంగా 7 పతాకాలు అందుకున్నాడు. ఇందులో 5 స్వర్ణ పతకాలు, 2 రజత పతకాలు ఉన్నాయి. స్విమ్మింగ్ 100 మీటర్లు, 200 మీటర్లు, 1500 మీటర్లలో బంగారు పతకాలు, 400 మీటర్లు, 800 మీటర్లలో వెండి పతకాలు సాధించాడు. ఈ ఈవెంట్ లో పతకాలు అందుకున్న వేదాంత్ ఫోటోలు షేర్ చేసి మాధవన్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు. అంతేకాకుండా మిగిలిన విజేతలకు కూడా శుభాకాంక్షలు తెలిపాడు మాధవన్. దీంతో మరోసారి పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు అంతా వేదాంత్ ని అభినందిస్తున్నారు. ఒలంపిక్స్ లో పతకం గెలవడమే తన లక్ష్యం అని వేదాంత పలుమార్లు మీడియాతో తెలిపాడు. స్విమ్మింగ్ లో ఎలాగైనా వేదాంత్ ఒలంపిక్స్ వరకు వెళ్లి గెలవాలని అంతా కోరుకుంటున్నారు.