Viral video: పిలవకుండానే పెళ్లికి వచ్చి తిన్నాడని.. యువకుడిని పట్టుకుని ప్లేట్లు కడిగించిన పెళ్లి పెద్దలు

హోటల్ కు వెళ్లి కడుపునిండా తిన్నాక డబ్బు లేదని చెబితే ఏమవుతుంది? బిల్లు కట్టకపోతే అక్కడ ప్లేట్లు కడిగి వెళ్లమంటారు. కొన్ని సినిమాల్లో ఇటువంటి సీన్లను చూసి కడుపుబ్బా నవ్వుకుంటాం. అయితే, పిలవని పెళ్లికి వెళ్లి కడుపునిండా తిన్న ఓ యువకుడిని పట్టుకున్న పెళ్లి పెద్దలు అతడితో ప్లేట్లు, పాత్రలు కడిగించారు. నిజ జీవితంలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

Viral video: పిలవకుండానే పెళ్లికి వచ్చి తిన్నాడని.. యువకుడిని పట్టుకుని ప్లేట్లు కడిగించిన పెళ్లి పెద్దలు

Viral video

Viral video: హోటల్ కు వెళ్లి కడుపునిండా తిన్నాక డబ్బు లేదని చెబితే ఏమవుతుంది? బిల్లు కట్టకపోతే అక్కడ ప్లేట్లు కడిగి వెళ్లమంటారు. కొన్ని సినిమాల్లో ఇటువంటి సీన్లను చూసి కడుపుబ్బా నవ్వుకుంటాం. అయితే, పిలవని పెళ్లికి వెళ్లి కడుపునిండా తిన్న ఓ యువకుడిని పట్టుకున్న పెళ్లి పెద్దలు అతడితో పాత్రలు కడిగించారు. నిజ జీవితంలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

పెళ్లికి పిలవకపోయినా వెళ్లి భోజనం చేయడం మన దేశంలో సాధారణమే. వివాహ వేడుకకు అందరూ ఆహ్వానితులేనని కూడా కొందరు బోర్డులు పెడుతుంటారు. అతిథులు కడుపునిండా తిని ఆశీర్వదించి వెళ్తే మంచిదని భావిస్తుంటారు. పెళ్లిలో ఇలా మరో పుణ్యకార్యం జరిగిందని భావించే వారూ ఉంటారు.

FIFA World Cup-2022: సొంత దేశం ఓడిపోయినందుకు ఇరాన్‌లో ప్రజల సంబరాలు

మధ్యప్రదేశ్ లో తాజాగా ఓ ఎంబీఏ విద్యార్థి పిలవని పెళ్లికి వెళ్లి భోజనం చేశాడు. అతడిని గుర్తించిన పెళ్లి పెద్దలు ఎవరు నువ్వు? ఈ పెళ్లికి ఎందుకు వచ్చావు? నిన్ను ఎవరు పిలిచారు? నీకు వివాహ పత్రిక అందిందా? నీకు బుద్ధి ఉందా? అంటూ తిట్టారు. కడుపు నిండా భోజనం తిన్నందుకు పెళ్లి ప్లేట్లు, పాత్రలు కడిగి వెళ్లాలని బెదిరించి, దగ్గరుండి వాటిని కడిగించారు. అంతేగాక, ఆ సమయంలో అతడి వీడియో తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..