Sarkaru Vaari Paata : సెలబ్రేషన్స్ స్టార్ట్.. ఫస్ట్ నోటీస్ వచ్చేస్తోంది..
సూపర్‌స్టార్ మహేష్ బాబు తన ఫ్యాన్స్‌కి బర్త్‌డే ట్రీట్ రెడీ చేస్తున్నారు..
Sarkaru Vaari Paata: సూపర్‌స్టార్ మహేష్ బాబు తన ఫ్యాన్స్‌కి బర్త్‌డే ట్రీట్ రెడీ చేస్తున్నారు. పుట్టినరోజుకి పది రోజుల ముందుగానే ‘సర్కారు వారి పాట’ ఫెస్ట్ స్టార్ట్ కాబోతున్నట్లు అప్డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. పరశురామ్ దర్శకత్వంలో మహేష్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న క్రేజీ మూవీ.. ‘సర్కారు వారి పాట’..
GMB ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. సంక్రాంతి రిలీజ్‌కి ప్లాన్ చేసుకుంటున్న ఈ సినిమా మేజర్ షూటింగ్ దుబాయ్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంది. సెకండ్ వేవ్ లాక్డౌన్ తర్వాత ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ రీ స్టార్ట్ అయ్యింది.
Happy to be back on sets after a long time… #SarkaruVaariPaata shoot resumes today. ?#SVPShootResumes
@urstrulyMahesh @KeerthyOfficial @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus pic.twitter.com/sa5LFSRouN
— Parasuram Petla (@ParasuramPetla) July 12, 2021
ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా ఫస్ట్‌లుక్, టీజర్ లాంటి అప్డేట్ ఉంటుంది అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో పది రోజుల ముందుగానే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపారు. సర్కారు వారి పాట ఫస్ట్ నోటీస్ జూలై 31న ఇవ్వనున్నామంటూ బ్యాగ్ పట్టుకుని ఉన్న మహేష్ పిక్ వదిలారు టీం. ఈ అప్డేట్తో #SVPFirstNotice హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Witness our SuperStar in never seen before avatar ?#SVPFirstNotice on July 31st ?#SarkaruVaariPaata
Super ? @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @GMBents @14ReelsPlus @SVPTheFilm pic.twitter.com/fwEEZv8AnY
— Mythri Movie Makers (@MythriOfficial) July 29, 2021