Mallu Bhatti Vikramarka : ఈ 9ఏళ్లలో కేసీఆర్ ఆయన కుటుంబం మాత్రమే లాభపడింది-భట్టి విక్రమార్క

హాత్ సే హాత్ జోడో యాత్రలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. సీఎం కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ వచ్చిన ఈ 9ఏళ్లలో కేసీఆర్ ఆయన కుటంబం మాత్రమే లాభపడిందన్నారు భట్టి విక్రమార్క. హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా ఇచ్చోడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.

Mallu Bhatti Vikramarka : ఈ 9ఏళ్లలో కేసీఆర్ ఆయన కుటుంబం మాత్రమే లాభపడింది-భట్టి విక్రమార్క

Updated On : March 17, 2023 / 9:53 AM IST

Mallu Bhatti Vikramarka : హాత్ సే హాత్ జోడో యాత్రలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. సీఎం కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ వచ్చిన ఈ 9ఏళ్లలో కేసీఆర్ ఆయన కుటంబం మాత్రమే లాభపడిందన్నారు భట్టి విక్రమార్క. హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా ఇచ్చోడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.

Also Read..Mahbubnagar Lok Sabha Constituency : ఆసక్తి రేపుతోన్న పాలమూరు పార్లమెంట్‌ ఫైట్‌…మహబూబ్‌నగర్‌ ను కాంగ్రెస్‌ ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది?

తెలంగాణ వచ్చిన నాటి నుండి 9 సంవత్సరాల పాటు 18 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా.. 86 శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాలకు ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో మద్యం విచ్చలవిడిగా ప్రవహిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బెల్ట్ షాపులను బంద్ చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పటివరకు ఒక్క ఎకరానికి కూడ నీరు పారించలేదన్నారు. ఇప్పుడు వ్యవసాయ భూములకు పారే నీరంత కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల ద్వారా వస్తున్నవే అని భట్టి విక్రమార్క చెప్పారు.

Also Read..Khammam Assembly Constituency: రాబోయే ఎన్నికల్లో.. ఖమ్మం గుమ్మంలో కనిపించబోయే సీనేంటి.. ఆ ముగ్గురు పోటీ చేస్తే..?

నీరు రాలేదు. నిధులు లేవు, నియామకాలు లేవు అని భట్టి అన్నారు. అటు కేంద్రంలోని మోదీ సర్కార్ పైనా భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. మోదీ తన మిత్రుడు అదానీ ఆర్థికంగా ఎదగడానికి మాత్రమే కృషి చేస్తున్నారని విమర్శించారు. అదానీ వ్యవహారం ప్రపంచ వేదికగా బట్టబయలైన విషయాన్ని దాచిపెట్టడానికి పార్లమెంటులో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను రికార్డుల నుండి తొలగించే ప్రయత్నం చేస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు.