Gurudwara Temple: గురుద్వారపై జెండాను తొలగించబోయిన వ్యక్తిని కొట్టి చంపిన భక్తులు

పంజాబ్ లోని స్వర్ణ దేవాలయంలో ఘటన కారణంగా మరో వ్యక్తి హతమయ్యాడు. దేవాలయంపై ఉన్న మతపరమైన జెండాను తొలగించినందుకు గానూ సిక్కు భక్తులు ఆగ్రహానికి లోనయ్యారు. కపుర్తలాలోని నిజాంపూర్.....

Gurudwara Temple: గురుద్వారపై జెండాను తొలగించబోయిన వ్యక్తిని కొట్టి చంపిన భక్తులు

Golden Temple

Gurudwara Temple: పంజాబ్ లోని స్వర్ణ దేవాలయంలో ఘటన కారణంగా మరో వ్యక్తి హతమయ్యాడు. దేవాలయంపై ఉన్న మతపరమైన జెండాను తొలగించినందుకు గానూ సిక్కు భక్తులు ఆగ్రహానికి లోనయ్యారు. కపుర్తలాలోని నిజాంపూర్ గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. నిజాంపూర్‌లోని గురుద్వారాలో సిక్కుల మత జెండా అయిన నిషాన్ సాహిబ్‌ను తొలగించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అతణ్ని అడ్డుకున్న గ్రామస్థులు ఆవేశంలో చావబాదారు.

‘ఈ కేసులకు పంజాబ్ పోలీసులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సమాన బాధ్యత వహిస్తాయి. పోలీసులు, ఏ ఇతర ఏజెన్సీ జోక్యం ఇందులో చేసుకోవడానికి వీల్లేదు’ అని గురుద్వార నుంచి ప్రకటన వెలువడింది. ఆదివారం ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలంటూ అందులో పిలుపునిచ్చారు.

పంజాబ్‌లో గత 24 గంటల్లో ఇలా హత్య జరగడం రెండోసారి. శనివారం సాయంత్రం, అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ లోపల ఉండే సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేయడానికి ప్రయత్నించినందుకుగానూ వ్యక్తిని కొట్టి చంపారు. ముందస్తు జాగ్రత్తగా అమృత్‌సర్ పోలీసులు గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై నిఘాను పెంచారు.

…………………………………… : కొడుకు ఆత్మహత్యని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

శనివారం సాయంత్రం జరిగిన ఘటనకు సంబంధించి ఏవైనా ఆనవాళ్లు దొరకుతాయా అని పోలీసులు బయోమెట్రిక్ ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నారు.